logo

తీయని వేడుకకు.. పేట ముస్తాబు

తీయని వేడుకకు పేట ముస్తాబైంది. ఉగాది పర్వదినాన జరిగే చిలుకల తీర్థం (పేరంటాలమ్మ జాతర)కు పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు.

Published : 21 Mar 2023 03:28 IST

ఉగాది రోజున పంచదార చిలుకల తీర్థం
పాయకరావుపేట, న్యూస్‌టుడే

తీయని వేడుకకు పేట ముస్తాబైంది. ఉగాది పర్వదినాన జరిగే చిలుకల తీర్థం (పేరంటాలమ్మ జాతర)కు పట్టణంలో ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. మంగవరం రోడ్డులోని పేరంటాలమ్మ ఆలయానికి రంగులు వేస్తున్నారు. కొన్నేళ్లుగా ఉగాది రోజున చిలుకల తీర్థం పేరుతో పేరంటాలమ్మ జాతర చేయడం సంప్రదాయంగా వస్తోంది. ఉమ్మడి తూర్పు, విశాఖ జిల్లాల్లోని పలు మండలాల నుంచి తీర్థానికి వేలాదిగా తరలివస్తుంటారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తీర్థంలో పంచదార చిలుకలు, చేటలు కొనుగోలు చేస్తుంటారు. వీటిని ఇళ్లలో దేవుడి గదిలో ఉంచి పూజలు చేస్తారు. ఎలమంచిలి, అడ్డరోడ్డు, కోటవురట్ల, నర్సీపట్నం, కాకినాడ జిల్లా తుని, కోటనందూరు, అన్నవరం, తొండంగి తదితర ప్రాంతాల నుంచి వచ్చే భక్తజనంతో పేట జనజాతరను తలపిస్తుంది. సీఐ అప్పలరాజు మాట్లాడుతూ.. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వాహనాల రాకపోకలు నియంత్రిస్తామన్నారు. ప్రధాన రహదారిలో గౌతమ్‌ కూడలి నుంచి మంగవరం రోడ్డు కూడలి, అరట్లకోట వెళ్లే రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిపివేస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని