logo

సాంకేతిక ఉత్సవం ప్రారంభం

గీతం డీమ్డ్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న సాంకేతిక ఉత్సవం (సంఘర్ష్‌)ను హోమిబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌, అణు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవి బి.గ్రోవర్‌ ప్రారంభించారు.

Published : 21 Mar 2023 03:28 IST

విద్యార్థులు తీర్చిదిద్దిన ఆవిష్కరణలను పరిశీలిస్తున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత రవి బి.గ్రోవర్‌ తదితరులు

సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: గీతం డీమ్డ్‌ వర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో సోమవారం నుంచి నిర్వహిస్తున్న సాంకేతిక ఉత్సవం (సంఘర్ష్‌)ను హోమిబాబా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఎమిరిటస్‌ ప్రొఫెసర్‌, అణు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత రవి బి.గ్రోవర్‌ ప్రారంభించారు. దేశంలో శక్తి ఉత్పాదన రంగంలో అణు విద్యుత్తు అసలైన ప్రత్యామ్నాయమన్నారు. ప్రజలకు తక్కువ ఖర్చుతో అవసరానికి సరిపడా విద్యుత్తు అందించాలంటే అణు విద్యుత్తు కేంద్రాల ద్వారా మాత్రమే సాధ్యమన్నారు. గీతం డీన్‌ ప్రొఫెసర్‌ సి.విజయశేఖర్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌ విభాగాధిపతి ప్రొఫెసర్‌ వి.శ్రీనివాస్‌, ఫ్యాకల్టీ సలహాదారు డాక్టర్‌ ఆర్‌.భానుపవన్‌, ఏటికొప్పాక బొమ్మల తయారీ నిపుణుడు, జాతీయ ప్రతిభ అవార్డు గ్రహీత పెదపాటి ఆనందాచారి కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన రోబో నమూనాలు, హైడ్రోగ్రావిటీ నీటి శుద్ధి కేంద్రం, తీర్చిదిద్దిన వాహనాలు తదితర ఆవిష్కరణలను ప్రదర్శనలో ఉంచారు. ఉత్సవ అధ్యక్షుడు బసంత్‌, ఉపాధ్యక్షురాలు శ్రేయ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని