logo

ఏయూ బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌కు ఆర్‌సీఐ గుర్తింపు

ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుకు రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు లభించింది.

Published : 21 Mar 2023 03:28 IST

వీసీ ప్రసాదరెడ్డి నుంచి ఉత్తర్వులు అందుకుంటున్న ఆచార్య టి.షారోన్‌ రాజు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుకు రీహాబిలిటేషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌సీఐ) గుర్తింపు లభించింది. ఇటీవల ఏయూను సందర్శించిన ఆర్‌సీఐ నిపుణుల కమిటీ సభ్యులు ఏయూలో కోర్సు నిర్వహణ పరిశీలించారు. రెండు సంవత్సరాల కాల వ్యవధితో బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సును ఏయూ నిర్వహిస్తోంది. ఒక్కొక్క సంవత్సరం 30 మందికి ప్రవేశం కల్పిస్తారు. 2027 సంవత్సరం వరకు కోర్సు నిర్వహణకు ఆర్‌సీఐ అనుమతి ఇచ్చింది. ఈ సందర్భంగా ఆర్‌సీఐ అందించిన ఉత్తర్వులను ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి విద్య విభాగాధిపతి ఆచార్య టి.షారోన్‌రాజుకు అందజేశారు. ఆర్‌సీఐ అనుమతి లభించడం పట్ల వీసీ హర్షం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని