logo

జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు శ్రీప్రకాష్‌ విద్యార్థులు ఎంపికయ్యారు. కృష్ణాజిల్లా గన్నవరంలో ఈ ఏడాది జనవరిలో 37వ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ పోటీలు జరిగాయి.

Published : 24 Mar 2023 05:37 IST

పాయకరావుపేట, న్యూస్‌టుడే: జాతీయ స్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీలకు శ్రీప్రకాష్‌ విద్యార్థులు ఎంపికయ్యారు. కృష్ణాజిల్లా గన్నవరంలో ఈ ఏడాది జనవరిలో 37వ రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ పోటీలు జరిగాయి. ఆ పోటీల్లో ప్రతిభ చూపిన రాజాన కుమార్‌, లాలం దిలీప్‌, దొండా రేవంత్‌ జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని సీనియర్‌ ప్రిన్సిపల్‌ మూర్తి తెలిపారు. ఈ నెల 27 నుంచి అసోం రాష్ట్రం గువహటిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. విద్యార్థులను సంస్థ అధినేత నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజయ్‌ప్రకాష్‌ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని