logo

నగరాల అభివృద్ధికి నిధుల సమీకరణపై మథనం

20 సన్నాహక సదస్సుకు ముందుగా నిర్వహించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ పేర్కొన్నారు.

Published : 24 Mar 2023 05:42 IST

మాట్లాడుతున్న జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు; హాజరైన డీఈఏ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ప్రతినిధులు

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: @ 20 సన్నాహక సదస్సుకు ముందుగా నిర్వహించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యూజీ) సమావేశం ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ పేర్కొన్నారు. డీఈఏ, గృహ, ఆర్థిక వ్యవహారాల శాఖ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థ (ఐఎఫ్‌సీ)ల సంయుక్త ఆధ్వర్యంలో ‘నగరాలు ప్రైవేటు పెట్టుబడులను ఎలా ఉపయోగించుకోవచ్చు’ అనే అంశంపై ప్రాంతీయ వర్క్‌షాప్‌లో భాగంగా గురువారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నగరాల ఆర్థిక సామర్థ్యం పెంపునకు ప్రణాళికలు, అభివృద్ధికి గల మార్గాలు, తదితర అంశాలపై కీలక చర్చలు జరిగాయి.

సూచనలు.. సలహాలు

నగరాల ఆర్థిక సామర్థ్యం పెంపునకు గల అవకాశాలపై ఎస్బీఐ ప్రాజెక్టు ఫైనాన్స్‌, స్ట్రక్చరింగ్‌ స్ట్రాటిజిక్‌ బిజినెస్‌ యూనిట్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ అశోక్‌ శర్మ, క్రిసిల్‌ రేటింగ్స్‌ సంస్థ అధ్యక్షుడు సుబోద్‌ రాయ్‌, ఎస్‌బీఐ క్యాప్స్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు రామమూర్తి అయ్యర్‌ పలు సూచనలు చేశారు. విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) నిర్వహిస్తున్న మురుగునీటి శుద్ధి ప్రాజెక్టులో భాగంగా ‘ఏ గ్రీన్‌ ఇనీషియేటివ్‌ అండ్‌ మైల్‌స్టోన్‌ ప్రాజెక్టు’ గురించి జీవీఎంసీ కమిషనర్‌ పి.రాజాబాబు వివరించారు. హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) ప్రైవేటు పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాల కల్పనకు చేపట్టిన చర్యలను జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఫైనాన్సియల్‌ అధికారి విజయ కుమార్‌ వివరించారు. ఆయా అంశాలపై ఐఎఫ్‌సీ సీఎంఏ, సీఓఓ కల్వకొండ విజయ శేఖర్‌ చర్చించారు. అనంతరం నగరాల అభివృద్ధికి నిధుల సమీకరణపై ప్రపంచంలోని వివిధ ఉదాహరణలతో సహా సలహాలు, ఇతర అంశాలపై డీఈఏ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌, ఐఎఫ్‌సీ ప్రతినిధులు చర్చించారు. కార్యక్రమంలో ఏపీతో పాటు తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన లక్షద్వీప్‌, పుదుచ్చేరికి చెందిన పుర కమిషనర్లు, మేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని