logo

తెదేపా కార్యాలయంలో సంబరాలు

శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పి.అనురాధ విజయం సాధించడంతో తెదేపా కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి.

Published : 24 Mar 2023 05:42 IST

తెదేపా కార్యాలయంలో జరిగిన సంబరాల్లో సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు గంటా, పల్లా, నజీర్‌, బాబ్జీ, లాలం భాస్కరరావు, తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: శాసనసభ్యుల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి పి.అనురాధ విజయం సాధించడంతో తెదేపా కార్యాలయంలో సంబరాలు మిన్నంటాయి. అమరావతి నుంచి గురువారం రాత్రి పార్టీ కార్యాలయానికి చేరుకున్న నాయకులు, పార్టీ నేతలు కలిసి సంబరాలు చేసుకున్నారు. కేకు కోసి, టపాసులు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇదే పంథా కొనసాగాలని పార్టీ నేతలు అభిలషించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు చర్చనీయాంశమయ్యాయి. తెదేపాకు బలం లేకున్నా ఎన్నికల బరిలో దిగి.. వైకాపా నుంచి వచ్చిన ఓట్లతో గెలుపొందడం గమనార్హం. వైకాపా ఎమ్మెల్యేల్లో అసంతృప్తి ఎక్కువగా ఉందనే విషయాన్ని ఈ ఎన్నికలు రుజువు చేశాయని పార్టీ నేతలు పేర్కొన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన వైకాపాకు ఈ ఎన్నికలు మరింతగా షాక్‌ ఇచ్చినట్లయిందన్నారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేకు కోసి వేడుకలు నిర్వహించారు. విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, దక్షిణ నియోజకవర్గ బాధ్యుడు గండి బాబ్జీ, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నజీర్‌, పార్టీ నాయకులు  పాల్గొన్నారు. పైలా ప్రసాద్‌, గొంప కృష్ణ ఆధ్వర్యంలో మాడుగుల నియోజకవర్గ నాయకులు కూడా ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అలాగే...పెందుర్తి కూడలిలో ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద సంబరాలు చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని