logo

కనులవిందుగా కార్నివాల్‌

జీ20 సన్నాహక సదస్సుల సందర్భంగా సాగర తీరంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘వైజాగ్‌ కార్నివాల్‌’ ఆకట్టుకుంది.

Published : 27 Mar 2023 03:55 IST

బీచ్‌ రోడ్డులో కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన

ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం: జీ20 సన్నాహక సదస్సుల సందర్భంగా సాగర తీరంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ‘వైజాగ్‌ కార్నివాల్‌’ ఆకట్టుకుంది. వైఎంసీఏ కూడలి నుంచి ఆర్కే బీచ్‌ వరకు సాగిన ఈ ప్రదర్శన జాతరను తలపించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు కూచిపూడి, థింసా, కోలాటం, తప్పెటగుళ్లు, గరగ నృత్యం, పులివేషాలు, కర్రసాము, కత్తిసాము, గిరిజన నృత్యాలు ప్రదర్శించారు. అనంతరం ఆర్కే బీచ్‌ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్‌, ఆదిమూలపు సురేష్‌, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి, కలెక్టర్‌ మల్లికార్జున, మేయర్‌ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, జేసీ కె.ఎస్‌.విశ్వనాథన్‌, తదితరులు పాల్గొన్నారు. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున తరలివచ్చిన సందర్శకులతో బీచ్‌ రోడ్డులో రద్దీ నెలకొంది.

ఆకట్టుకున్న గిరిజన నృత్యం

యువకుడి విన్యాసం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని