logo

తీరంలో అవగాహన పరుగు

జి-20 సన్నాహక సదస్సు విశాఖలో నిర్వహించడం గర్వకారణమని మంత్రి విడుదల రజిని అన్నారు. ఆర్‌.కె.బీచ్‌ కాళీమాత ఆవరణలో ఆదివారం ఉదయం జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కె, 5కె, 3కె రన్‌లను మంత్రులు విడుదల రజిని, ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు.

Published : 27 Mar 2023 03:55 IST

మారథాన్‌లో పాల్గొన్న నగరవాసులు

పెదవాల్తేరు, న్యూస్‌టుడే: జి-20 సన్నాహక సదస్సు విశాఖలో నిర్వహించడం గర్వకారణమని మంత్రి విడుదల రజిని అన్నారు. ఆర్‌.కె.బీచ్‌ కాళీమాత ఆవరణలో ఆదివారం ఉదయం జీవీఎంసీ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కె, 5కె, 3కె రన్‌లను మంత్రులు విడుదల రజిని, ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌ జెండా ఊపి ప్రారంభించారు. మంత్రి రజిని మాట్లాడుతూ.. జి.20 సన్నాహాక సదస్సుపై అవగాహన కల్పించడానికే పరుగు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం పారా మోటర్‌ ఎయిర్‌ సఫారీని ప్రారంభించారు.

మంత్రి సురేష్‌ మాట్లాడుతూ.. జి-20 సదస్సు వల్ల నగరానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందన్నారు. మంత్రులు మారథాన్‌ విజేతలకు బహుమతులు అందజేశారు. నగర మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, పోలీసు కమిషనర్‌ సి.హెచ్‌.శ్రీకాంత్‌, జీవీఎంసీ కమిషనర్‌ రాజాబాబు, జీవీఎంసీ ప్రధాన ఇంజినీర్లు రవికృష్ణరాజు, జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని