ఏలేరు కాలువలో వాలంటీర్ మృతదేహం లభ్యం
ఏలేరు కాలువలో మండలంలోని రాయుడుపేట వద్ద వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సై సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బవులువాడ గ్రామానికి చెందిన దాసరి రమణ (28) గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు.
విషాదంలో మృతుడి భార్య
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: ఏలేరు కాలువలో మండలంలోని రాయుడుపేట వద్ద వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఎస్సై సింహాచలం తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బవులువాడ గ్రామానికి చెందిన దాసరి రమణ (28) గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తున్నాడు. అనకాపల్లికి చెందిన సంధ్యశ్రీతో ఏడాదిన్నర క్రితం వివాహమైంది. వీరికి తొమ్మిది నెలల బాబు ఉన్నాడు. శుక్రవారం రాత్రి భార్యను అనకాపల్లిలో దింపి రమణ వెళ్లిపోయాడు. ఇంటికి చేరకపోవడంతో వెదికిన కుటుంబ సభ్యులు ఏలేరు కాలువ వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారి సహకారంతో ఏలేరు కాలువ వద్ద వెతికారు. ఆదివారం రాయుడుపేట వద్ద రమణ మృతదేహం లభ్యమైంది. కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రమణ సోదరుడు సోమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతికి కారణాలు ఇంకా తెలియవన్నారు. ఏడాదిన్నర కిత్రం వివాహమై తొమ్మిది నెలల బాబుతో ఉన్న భార్య సంధ్యశ్రీ రోదన బంధువులను కలచివేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Anasuya: విజయ్ దేవరకొండతో మాట్లాడటానికి ప్రయత్నించా: అనసూయ
-
Politics News
Siddaramaiah: సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య
-
General News
TSPSC: Group-1 ప్రిలిమ్స్ రాసే వారికి TSPSC సూచనలు
-
Politics News
JP Nadda: ఓటు బ్యాంకు రాజకీయాలు చేయం.. అభివృద్ధే మా ధ్యేయం: జేపీ నడ్డా
-
General News
Polavaram: ఎప్పటికైనా పోలవరం పూర్తి చేసేది చంద్రబాబే: తెదేపా నేతలు
-
India News
Helicopter ride: చదువుల్లో మెరిసి.. హెలికాప్టర్లో విహారంతో మురిసిన విద్యార్థులు!