logo

చిత్ర వార్తలు

జీ-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో పెదవాల్తేరు ఏయూ గేటు వద్ద ఈ బస్‌బేను రూ.లక్షలు వెచ్చించి ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే అవకాశాలు చాలా తక్కువ.

Updated : 27 Mar 2023 05:18 IST

ఈ మెరుపులు ఎవరి కోసం!
- ఈనాడు, విశాఖపట్నం

జీ-20 సన్నాహక సదస్సుల నేపథ్యంలో పెదవాల్తేరు ఏయూ గేటు వద్ద ఈ బస్‌బేను రూ.లక్షలు వెచ్చించి ఆధునికంగా తీర్చిదిద్దారు. అయితే ఈ మార్గంలో ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించే అవకాశాలు చాలా తక్కువ. ప్రయాణికులు నిరీక్షించిన దాఖలాలు లేవు. కేవలం సదస్సులకు వచ్చే ప్రతినిధులను మెప్పించడం కోసం ఇలా ప్రజాధనం వృథా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.


ఉత్సాహంగా ‘పరుగు’

‘జీ-20’ సందర్భంగా ఆర్‌కేబీచ్‌ కాళీమాత ఆలయం వద్ద ఆదివారం ఉదయం జీవీఎంసీ ఆధ్వర్యంలో 10కె, 5కె, 3కె పరుగు(మారథాన్‌) పోటీలు నిర్వహించారు. మంత్రులు విడదల రజిని, ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌ పోటీలను ప్రారంభించారు.  నగరవాసులు ఉత్సాహంగా పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని