logo

జోరుగా మామిడి ఎగుమతులు

ఉగాది ముందు నుంచే చెట్లకు కనిపించే లేత మామిడికాయల వ్యాపారంతో చినదొడ్డిగల్లు కూడలి కళకళలాడుతోంది. చిన్నకాయలతో దాదాపు నెల రోజులపాటు సాగే ఎగుమతులతో రైతులకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ వ్యాపారం జోరుగా సాగుతోంది. 

Updated : 27 Mar 2023 05:33 IST

న్యూస్‌టుడే, నక్కపల్లి

కలెక్టర్‌ రకం మామిడి కాయలు

ఉగాది ముందు నుంచే చెట్లకు కనిపించే లేత మామిడికాయల వ్యాపారంతో చినదొడ్డిగల్లు కూడలి కళకళలాడుతోంది. చిన్నకాయలతో దాదాపు నెల రోజులపాటు సాగే ఎగుమతులతో రైతులకు ఆదాయం వస్తోంది. ప్రస్తుతం ఇక్కడ వ్యాపారం జోరుగా సాగుతోంది. 

జిల్లాలో మామిడి వ్యాపారానికి కేంద్రంగా మారిన నక్కపల్లి మండలంలో అగ్రభాగం చినదొడ్డిగల్లుదే. సీజన్‌లో వేల టన్నుల కాయ ఎగుమతి జరుగుతుండగా, వందల మంది ఉపాధి పొందుతున్నారు. జాతీయ రహదారి కూడలిని ఆనుకుని దాదాపు 20 వ్యాపార దుకాణాలున్నాయి. వేంపాడు, డొంకాడ, రేబాక ప్రాంతాల నుంచీ క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. మామిడిలో తొలుత దేశవాళీ, కలెక్టర్‌ రకాలు వస్తుంటాయి. ఇవి పక్వానికి రాకుండానే లేతగా ఉండగానే కోసేసి బయటి ప్రాంతాలకు పంపుతుంటారు.

తూర్పు ప్రాంతానికి సరఫరా

తూర్పుగోదావరి జిల్లాతోపాటు నక్కపల్లి, నర్సీపట్నం, అనకాపల్లి, ఎస్‌.రాయవరం తదితర ప్రాంతాల నుంచి లేతకాయలను ఇక్కడి మార్కెట్‌కు తెస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌, బిహార్‌, ఒడిశా ప్రాంతాల్లో వీటికి డిమాండు ఎక్కువ. కూరకు, తాత్కాలిక పచ్చళ్లతోపాటు మిఠాయి తయారీకి ఎక్కువగా వాడుతుంటారు. రైతుల నుంచి సేకరించిన కాయలను లారీలు, వ్యాన్లలో ఆయా ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు. ఇందులో అధికశాతం పశ్చిమ బెంగాల్‌కు వెళ్తోంది. రెండు వారాల కిందట మొదలైన వ్యాపారం ప్రస్తుతం జోరందుకుంది. మరో రెండువారాల పాటు కొనసాగనుంది. అనంతరం పండ్ల వాణిజ్యం మొదలవుతుంది. ప్రస్తుతం లేత కాయ టన్ను రూ. 16 వేల వరకు ధర పలుకుతోంది. మొదట్లో ఈ ధర దాదాపు రూ. 40 వేలకు చేరినా.. దశలవారీగా దిగుబడులు పెరగడంతో ధర తగ్గింది. రోజుకు సగటున వంద టన్నుల వరకు సరకు ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్తోందని వ్యాపారులు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని