logo

కొరియా ప్రతినిధులతో మంత్రి అమర్‌నాథ్‌ భేటీ

ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ నేతృత్వంలో కొరియా అధికారుల ప్రతినిధి బృందం సోమవారం సర్క్యూట్‌ హౌస్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిశారు.

Published : 28 Mar 2023 04:16 IST

మంత్రి, అధికారులతో కొరియా  ప్రతినిధులు

ఈనాడు, విశాఖపట్నం: ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ నేతృత్వంలో కొరియా అధికారుల ప్రతినిధి బృందం సోమవారం సర్క్యూట్‌ హౌస్‌లో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ను కలిశారు. ఇరుదేశాల పరస్పర వాణిజ్య సహకారాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ పెట్టుబడులకు గమ్యస్థానమని, అందుకు రాష్ట్ర పారిశ్రామిక విధానం కారణమంటూ ప్రతినిధులకు ఆయన వివరించారు. వర్తక వాణిజ్య రంగంలో ఏపీ సౌత్‌ ఏసియాకు ముఖద్వారంగా నిలిచిందని, ఇరుదేశాల మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలపడాలని ఆకాంక్షించినట్లు మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ సృజన ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని