logo

కలప డిపోలో అటవీ కార్యాలయం

జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని శివపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న కలప డిపోలోకి సోమవారం మార్పు చేశారు.

Published : 28 Mar 2023 04:16 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లా అటవీ శాఖ కార్యాలయాన్ని శివపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న కలప డిపోలోకి సోమవారం మార్పు చేశారు. రేంజ్‌ కార్యాలయం, సబ్‌ డీఎఫ్‌వో కార్యాలయం నిర్వహించే గదుల్లో ఇక నుంచి జిల్లా అటవీ కార్యాలయం కొనసాగనుంది. రేంజ్‌ కార్యాలయాన్ని రేంజ్‌ అధికారి క్వార్టర్‌లోకి మార్చారు. జిల్లాల పునర్విభజన సమయంలోనే సబ్‌ డీఎఫ్‌ఓ పోస్టును ఎలమంచిలికి మార్చారు. డీఎఫ్‌ఓ బి.రాజారావు మాట్లాడుతూ.. ఇప్పటివరకు కొనసాగిన భవనం శిథిలం కావడంతో కలప డిపోలోని భవనంలోకి మార్పు చేసినట్లు చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 40 హెక్టార్లలో కొత్తగా ప్లాంటేషన్లు వేయడానికి ప్రతిపాదించామన్నారు. అటవీ అభివృద్ధికి పదేళ్ల ప్రణాళిక రూపొందించి ఉన్నతాధికారుల ఆమోదానికి పంపినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని