తంతడి తీరంలో డెవిల్
అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెం సముద్రతీరంలో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ జరిగింది.
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అచ్యుతాపురం మండలం తంతడి-వాడపాలెం సముద్రతీరంలో నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం షూటింగ్ జరిగింది. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై ‘డెవిల్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సుమిత్రా మీనా హీరోయిన్‌గా నటిస్తున్నారు. స్వాతంత్య్రానికి ముందు 1945 సంవత్సరంలో జరిగిన ఘట్టాల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 75 శాతం చిత్రీకరణ పూర్తయిందన్నారు. ఫైట్‌మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో సినిమాలో చివరి ఫైట్‌ను తంతడి-వాడపాలెం తీరంలో చిత్రీకరించారు. ఇందుకోసం ఫిరంగులు, పాత లారీలు, జీపులను రప్పించారు. తీరాన్ని ఆనుకొని కోట మాదిరిగా ఒక సెట్ ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 5 వరకు ఇక్కడ చిత్రీకరణ ఉంటుందని, తరవాత విశాఖపట్నంలోని కైలాసగిరి వద్ద కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తామని యూనిట్ వర్గాలు తెలిపాయి. బ్రిటిష్ వారి పాత్రలను పోషించడానికి విదేశాల నుంచి యువకులను షూటింగ్ నిమిత్తం ఇక్కడకు తీసుకొచ్చారు. ఈ సినిమాకి నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు.
తీరంలో ఏర్పాటుచేసిన సెట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. రంగంలోకి సీబీఐ
-
India News
Manipur: మణిపుర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఇంటర్నెట్పై బ్యాన్ కొనసాగింపు
-
General News
APSRTC: స్టీరింగ్ విరగడంతో ఆర్టీసీ బస్సు బోల్తా.. 19 మందికి గాయాలు
-
India News
Brij Bhushan Singh: రెజ్లర్ల ఆందోళన.. బ్రిజ్ భూషణ్ ఇంటికి దిల్లీ పోలీసులు
-
General News
Polavaranm-CM Jagan: పోలవరంలో సీఎం జగన్ పర్యటన
-
World News
Ukraine: ఉక్రెయిన్‌పై భారీ దాడి.. నోవా కఖోవ్కా డ్యామ్ పేల్చివేత..!