logo

గ్రామీణులకు 20 రకాల వైద్య సేవలు

గోపాలపురంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం 104 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా 20 రకాల వైద్యసేవలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.

Published : 28 Mar 2023 04:16 IST

జెండా ఊపి వాహనాలను ప్రారంభిస్తున్న మంత్రి అమర్‌నాథ్‌

అనకాపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గోపాలపురంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సోమవారం 104 వాహనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ వాహనాల ద్వారా 20 రకాల వైద్యసేవలు గ్రామీణ ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. దీర్ఘకాలిక వ్యాధులు, గర్భిణులు, బాలింతలకు సేవలు చేరువ అవుతాయన్నారు. ఈ వాహనాల్లో ఈసీజీ, రక్తపోటు, మధుమేహం వంటి పరీక్షలు చేస్తారన్నారు. వైద్య సేవలపై 104 నంబర్‌కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గొర్లి సూరిబాబు, జిల్లా పరిషత్తు ఉపాధ్యక్షురాలు సత్యవతి, వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు