logo

అధికారంలోకి రాగానే జెట్టీ మంజూరు

తెదేపా అధికారంలోకి రాగానే మత్స్యకారుల కోసం జెట్టీ మంజూరు చేయిస్తానని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హామీ ఇచ్చారు.

Published : 28 Mar 2023 04:16 IST

అనిత

అనితకు పుష్పగుచ్ఛం అందించిన మత్స్యకార సంఘ నాయకులు

నక్కపల్లి, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి రాగానే మత్స్యకారుల కోసం జెట్టీ మంజూరు చేయిస్తానని మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత హామీ ఇచ్చారు. జాతీయ మత్స్యకార సంఘ నాయకులు సోమవారం విశాఖలో ఆమెను కలిసి సమస్యలపై మాట్లాడారు. అనిత స్పందిస్తూ.. మత్స్యకారుల సంక్షేమానికి తెదేపా పెద్దపీట వేసిందన్నారు. రాయితీపై ఎన్నో పథకాలు అందించడంతోపాటు తీర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించిందన్నారు. వైకాపా ప్రభుత్వం వీటికి తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రాగానే నక్కపల్లి మండలానికి జెట్టీ మంజూరు చేయించడంతోపాటు త్వరితగతిన పూర్తయ్యేలా చూస్తానన్నారు. కొవిరి వెంకటేష్‌, పేర్ల శ్రీనివాసరావు, సిరిపల్లి అప్పలరాజు, వాసుపల్లి శివ తదితరులు అనితను  కలిసిన వారిలో ఉన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు