ఉత్సాహంగా గుర్రాల పరుగు పోటీలు
చోడిమాంబిక అమ్మవారి పుట్టుక మహోత్సవం సందర్భంగా రామన్నపాలెంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి గుర్రాల పరుగు పోటీల్లో రామన్నపాలెంనకు చెందిన చోడిమాంబిక విక్రమ్ అనే గుర్రం విజేతగా నిలిచింది.
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: చోడిమాంబిక అమ్మవారి పుట్టుక మహోత్సవం సందర్భంగా రామన్నపాలెంలో ఏర్పాటుచేసిన జిల్లాస్థాయి గుర్రాల పరుగు పోటీల్లో రామన్నపాలెంనకు చెందిన చోడిమాంబిక విక్రమ్ అనే గుర్రం విజేతగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 15 గుర్రాలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఈ పోటీల్లో విక్రమ్ గుర్రం 1.24 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకొని విజేతగా నిలవగా, తరువాత స్థానంలో దేవరాపల్లికి చెందిన నవీన్ చెర్రీ, కొట్యాడ తలారికి చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం మూడో స్థానంలో నిలిచింది. రామన్నపాలెంనకు చెందిన ధర్మిరెడ్డి అప్పారావు గుర్రం ఠాగూర్ నాలుగో స్థానం, కొట్యాడ తలారికి చెందిన సాయివిరాట్ అయిదో స్థానంలో నిలిచింది. ప్రథమ విజేతకు రూ. 12 వేలు నగదు బహుమతి అందించారు. పోటీలను చూడడానికి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా పోటీలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో సర్పంచి డ్రీమ్స్ నాయుడు, ఎంపీటీసీ సభ్యులు లాలం శ్రీను, వైకాపా నాయకుడు ధర్మిరెడ్డి నాయుడుబాబు, సర్వేయర్ సత్తిబాబు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
దిగంబరత, అశ్లీలత ఒకటి కాదు: హైకోర్టు
-
Sports News
పోరాటం కొనసాగిస్తాం.. రైల్వే ఉద్యోగాల్లో చేరిన రెజ్లర్లు
-
Ts-top-news News
19 నుంచి రాష్ట్రమంతా హరితోత్సవం
-
World News
Heart Attacks: తీవ్ర గుండెపోటు కేసులు ‘ఆ రోజే’ ఎక్కువ..? తాజా అధ్యయనం ఏమందంటే..!
-
India News
Odisha Train Accident: మృతులు, బాధితులను గుర్తించేందుకు సహకరించండి.. రైల్వేశాఖ విజ్ఞప్తి
-
Sports News
Virat Kohli: కష్టకాలంలో విరాట్‌కు అదృష్టం కలిసి రాలేదు.. : గావస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు