logo

పరదాకు అటువైపు..

జి-20 సదస్సుకు వచ్చే అతిథులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఎలాంటి చిరు వ్యాపారుల దుకాణాలు కనిపించకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది.

Published : 28 Mar 2023 04:16 IST

కైలాసగిరి రోప్‌ వద్ద ఉంచిన పరదా

జి-20 సదస్సుకు వచ్చే అతిథులు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో ఎలాంటి చిరు వ్యాపారుల దుకాణాలు కనిపించకుండా యంత్రాంగం జాగ్రత్తలు తీసుకుంటోంది. కైలాసగిరి రోప్‌వే వద్ద చిరు వ్యాపారులు పలు బడ్డీలు, తోపుడుబళ్లతో వ్యాపారం సాగించేవారు.  వీరిని తరలించేందుకు చర్యలు తీసుకున్నా దుకాణదారులు ఒప్పుకోకపోవటంతో వాటిని అక్కడే ఉంచి, అవి కనిపించకుండా నీలం రంగు పరదాను కప్పారు. దీంతో వెనుక ఉన్న బడ్డీలు, తోపుడు బళ్లు కనిపించవు. అలానే గెడ్డ కూడా కనిపించకుండా ఇలా పరదా కప్పినట్లుగా తెలుస్తోంది.

ప్రరదా వెనుకవైపు ఉన్న బడ్డీలు

న్యూస్‌టుడే, ఎంవీపీకాలనీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు