logo

వైకాపాలో దిద్దుబాటు చర్యలు అవసరం లేదు..

ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో గెలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబుకు కూడా నమ్మకం లేదని, అందుకే తన తనయుడు లోకేశ్‌ను పోటీలో నిలబెట్టలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజా అన్నారు.

Published : 29 Mar 2023 02:36 IST

పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజా

సింహాచలం, న్యూస్‌టుడే: ఇటీవల జరిగిన ఎమ్మెల్యే కోటా శాసనమండలి ఎన్నికల్లో గెలుస్తామని తెదేపా అధినేత చంద్రబాబుకు కూడా నమ్మకం లేదని, అందుకే తన తనయుడు లోకేశ్‌ను పోటీలో నిలబెట్టలేదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజా అన్నారు. సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం ఆమె మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పార్టీకి కట్టుబడి, జగన్‌ నాయకత్వం వల్ల గెలిచిన వారు ఆ విషయాన్ని మనసులో ఉంచుకుంటే ఎలాంటి తప్పులు చేయరని బహిష్కరణకు గురైన వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేల తిరుగుబాటుపై పార్టీలో దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వాళ్లు అమ్ముడుపోయి ధిక్కారం అంటే హాస్యాస్పదంగా ఉందన్నారు. వ్యక్తిగత, డబ్బుపై ఆశతో తీసుకున్న నిర్ణయాలను సీఎం జగన్‌పై వారు రుద్దడం సరికాదన్నారు. పార్టీ నుంచి వెళ్లిన వారంతా జగన్‌మోహన్‌రెడ్డి ఛరిష్మాతోనే గెలిచారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కొవిడ్‌ సమయంలో చావు బతుకుల్లో ఉంటే ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా హైదరాబాద్‌ పంపించి మళ్లీ కోలుకుని ఇంటికి వెళ్లే వరకు జగన్‌ పర్యవేక్షించిన విషయం తెలియదా అంటూ ప్రశ్నించారు. ముందు రోజు జగన్‌ వల్లే గెలిచానని చెప్పిన శ్రీదేవి మరుసటి రోజు ఎందుకు మాట మార్చారన్నారు. విశాఖ, చిత్తూరు, అనంతపురంలో గెలిచామని చెబుతున్న అచ్చెన్నాయుడు, చంద్రబాబు, బాలకృష్ణ రాజీనామా చేసి పార్టీ గుర్తుపై పోటీ చేసి గెలవాలని సవాలు విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని