హాకీ క్రీడాకారులకు కొరవడిన వసతులు
క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి కోరారు.
నెహ్రూచౌక్ (అనకాపల్లి), న్యూస్‌టుడే: క్రీడాకారులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కేంద్రం నిధులు మంజూరు చేయాలని ఎంపీ భీశెట్టి వెంకటసత్యవతి కోరారు. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా మంగళవారం జరిగిన సమావేశంలో ఎంపీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. నియోజకవర్గ పరిధిలో ప్రతిభ ఉండి క్రీడా సదుపాయాలు లేక ఎంతో మంది గ్రామీణ క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్రీడాకారులకు మంచి శిక్షణ ఇచ్చేందుకు ఖేలో ఇండియా కార్యక్రమంలో భాగంగా నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలమంచిలి హాకీ క్రీడాకారులకు సరైన క్రీడామైదానం, శిక్షణ కేంద్రం, మౌలిక సదుపాయాలు లేక క్రీడాకారులు శిక్షణకు ఇతర రాష్ట్రాలకు వెళ్లవలసిన పరిస్థితి నెలకొందన్నారు. హాకీలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు హాకీ స్టేడియం, శిక్షణకేంద్రం నిర్మాణానికి యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
భారతీయులకు వీసాల మంజూరులో జాప్యమేల?
-
Crime News
ప్రియుడి మర్మాంగం కోసిన యువతి
-
Ts-top-news News
భారత్లో మహిళలకు బైపాస్ సర్జరీ అనంతర ముప్పు తక్కువే!
-
Ap-top-news News
తిరుమల గగనతలంలో విమానాలు
-
Sports News
బ్యాటింగ్ ఎంచుకోవాల్సింది: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/06/2023)