logo

సాగర తీరాన కనువిందు

విశాఖ నగరంలో ‘జీ20’ సందడి నెలకొంది. ఓ వైపు విదేశీ ప్రతినిధులు... మరో వైపు దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాల నిపుణులు... ఇంకో వైపు రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం...

Published : 29 Mar 2023 03:17 IST

‘జీ20’కి  తరలివచ్చిన దేశ, విదేశాల అతిథులు

ఈనాడు-విశాఖపట్నం: విశాఖ నగరంలో ‘జీ20’ సందడి నెలకొంది. ఓ వైపు విదేశీ ప్రతినిధులు... మరో వైపు దేశం నలుమూలల నుంచి వచ్చిన వివిధ రంగాల నిపుణులు... ఇంకో వైపు రాష్ట్ర ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం... ఇలా ఎటు చూసినా ‘జీ 20’ సమావేశ నిర్వహణలో తలమునకలయ్యారు. మౌలిక అంశాలపై చర్చించేందుకు వచ్చిన ప్రముఖుల రాక నేపథ్యంలో సమావేశాల వేదిక ‘రాడిసన్‌ బ్లూ’ ప్రాంతం చుట్టూ సాగిన సుందరీకరణ పనులు కనువిందుగా ఉన్నాయి. మంగళవారం ఉదయం ప్రారంభమైన సమావేశాలు బుధవారం కూడా కొనసాగనున్నాయి.

మొన్న గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సదస్సు, నేడు జి-20 సన్నాహక సదస్సులు విజయవంతమయ్యాయని రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గుడివాడ అమర్‌నాథ్‌లు అన్నారు. వీఎంఆర్డీఏ పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరించిన  మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి అంశాలు సీఎం జగన్‌ తెలియజేశారన్నారు. విశాఖ నగర కీర్తిలో జి-20 సదస్సులు కలకాలం నిలుస్తాయన్నారు.

విదేశీ ప్రతినిధులకు మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన విందులో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. భారతదేశ కళలు, సంస్కృతి ప్రతిబింబించేలా సాగిన పలు ప్రదర్శనలు, వివిధ రకాల నృత్యాలు ఆకట్టుకున్నాయి. విదేశీ ప్రతినిధులు ఆతిథ్యం స్వీకరిస్తూ చరవాణిల్లో ఆ ప్రదర్శనలు బంధించారు.


మౌలిక సదుపాయాల కల్పనపై ‘జీ20’ సమావేశాలు చర్చిస్తున్నాయి. మా రాష్ట్రంలో భూమి లభ్యత చాలా ఉంది. ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంద’ని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి సదస్సులో వివరించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని