logo

సింహాచలంలో ‘ప్రసాద్‌’ పథకం పనులకు శ్రీకారం

కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన ‘ప్రసాద్‌’ పథకంలో భాగంగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని రూ.54.04 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజా వెల్లడించారు.

Published : 29 Mar 2023 03:17 IST

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న మంత్రులు రోజా, అమర్‌నాథ్‌, సురేష్‌, అధికారులు

సింహాచలం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మంజూరైన ‘ప్రసాద్‌’ పథకంలో భాగంగా సింహాచలం పుణ్యక్షేత్రాన్ని రూ.54.04 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజా వెల్లడించారు. మంగళవారం ఆమె సింహాద్రి అప్పన్న స్వామిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం అతిథి గృహంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘ప్రసాద్‌’ పథకంలో చేపట్టనున్న పనులకు సంబంధించి తుది డీపీఆర్‌ ఆమోదం పొందినట్లు తెలిపారు. మరో వారం రోజుల్లో టెండర్లు పిలిచి నెల రోజుల్లో పనులను ప్రారంభిస్తామన్నారు. కొండపైకి భక్తులు వచ్చేందుకు ఆరు విద్యుత్తు కార్లను ఏర్పాటు చేసి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, దేవస్థానం ఈవో వి.త్రినాథరావు, ట్రస్టీలు తదితరులు పాల్గొన్నారు.


నూతన పుస్తకావిష్కరణ

విశాఖపట్నం, న్యూస్‌టుడే : జీ20 వసుదైక కుటుంబం ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఒకే భూమి.. ఒకే కుటుంబం.. ఒకే భవిష్యత్తు’ పుస్తకాన్ని మంగళవారం సాయంత్రం విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో మంత్రులు అమర్‌నాథ్‌, రోజా, సురేష్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజిత్‌భార్గవ్‌, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, నగర పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని