అప్పన్న తిరు కల్యాణోత్సవం చూతము రారండి..
సింహగిరిపై కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 2న అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు.
దర్శన వేళలు.. ఆర్జిత సేవల్లో మార్పులు
సింహాచలం, న్యూస్‌టుడే: సింహగిరిపై కొలువైన శ్రీవరాహలక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాన్ని ఏప్రిల్ 2న అత్యంత వైభవోపేతంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో వి.త్రినాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 7వ తేదీ వరకు జరిగే కల్యాణోత్సవాలను పురస్కరించుకుని స్వామివారి దర్శనం వేళలు, ఆర్జిత సేవల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపారు.
1న అంకురార్పణతో శ్రీకారం
ఏప్రిల్ 1న రాత్రి 7 గంటల నుంచి కల్యాణోత్సవాలకు అంకురార్పణతో శ్రీకారం చుడతారు. ఈ సందర్భంగా ఆ రోజు రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవని పేర్కొన్నారు. 2న రథోత్సవం, కల్యాణోత్సవం నిర్వహించనున్నందున మధ్యాహ్నం 2.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనాలు నిలిపివేస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు కొట్నాల ఉత్సవం, సాయంత్రం 4 గంటల నుంచి ఆరాధన, విశేష హోమాలు, ధ్వజారోహణం, గ్రామ బలిహరణం జరుగుతాయి. రాత్రి 6.30 గంటల నుంచి ఎదురు సన్నాహోత్సవం, రాత్రి 8 గంటల నుంచి సింహగిరి మాడవీధుల్లో స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. రాత్రి 9.30 గంటల నుంచి స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవం జరుగుతుంది. ఆరోజు ఈ రాత్రి 8.30 గంటల నుంచి 10 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు. 3న స్వామివారి తిరువీధి సేవ, ఆరాధన, హోమాలు, గ్రామ బలిహరణం జరుగుతాయి. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు లభించవు.
* 4న ఉదయం 7.30 గంటల నుంచి వైదిక సదస్యం నేపథ్యంలో భక్తులకు ఉదయం 8 గంటల నుంచి దర్శనాలు కల్పిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి పండిత సదస్యం, సర్వజన మనోరంజని వాహనంపై గ్రామ తిరువీధి, రాత్రి 7 గంటల నుంచి ఆరాధన, 10 గంటలకు నివేదన జరుగుతాయి. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు లభించవు.
* 5న సాయంత్రం 5 గంటల నుంచి సూర్యప్రభ వాహనంపై స్వామివారి గ్రామ తిరువీధి నిర్వహించనున్నందున ఆ రోజు రాత్రి 7 గంటల నుంచి భక్తులకు దర్శనాలు లభించవు.
* 6న ఉదయం 6.30 గంటలకు పూర్ణాహుతి, అనంతరం బాలభోగం, చూర్ణోత్సవం, వసంతోత్సవం, తిరువీధి, పవిత్ర గంగధారలో చక్రవారి అవబృదోత్సవం జరుగుతాయి. రాత్రి 7 గంటల నుంచి మృగయోత్సవంలో భాగంగా దొంగల దోపు ఉత్సవం, ధ్వజావరోహణము జరుగుతాయి. ఈ సందర్భంగా రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు స్వామివారి దర్శనాలు లభించవు.
* 7న ఉదయం 8 గంటల నుంచి వినోదోత్సవం, ముత్యాల పల్లకీ సేవ, 11 గంటలకు మహా సంప్రోక్షణ జరుగుతాయి. ఈ సందర్భంగా ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు లభించవు. మళ్లీ సాయంత్రం 6 గంటల నుంచి భక్తులకు దర్శనాలు నిలిపివేస్తారు. రాత్రి ఆరాధన, శ్రీపుష్పయాగం, ద్వాదశారాధనలు, ఉయ్యాల సేవ, పవళింపు సేవ, ఏకాంత సేవతో వార్షిక కల్యాణోత్సవాలు పరిసమాప్తమవుతాయి.
* కల్యాణోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన టిక్కెట్లు రద్దు చేశారు. 1వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Revanth Reddy: కష్టపడి పని చేయాలి.. సర్వే ప్రాతిపదికనే టికెట్లు: రేవంత్ రెడ్డి
-
Crime News
Gold seized: నెల్లూరు, హైదరాబాద్లో 10.27 కిలోల బంగారం పట్టివేత
-
Politics News
Ajit Pawar: అజిత్ మళ్లీ పక్కకే.. ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా సుప్రియా సూలే
-
General News
Hyderabad: గీత కార్మికులకు రూ.12.50లక్షల ఎక్స్గ్రేషియా విడుదల: మంత్రి శ్రీనివాస్ గౌడ్
-
General News
Fire Accident: ఖమ్మం పత్తి మార్కెట్లో అగ్నిప్రమాదం
-
Sports News
WTC Final: క్లిష్టసమయంలో కీలక ఇన్నింగ్స్.. రహానె ప్రత్యేకత అదే: సునీల్ గావస్కర్