logo

‘ఈఓఐ’ని వెంటనే రద్దు చేయాలి

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఊతమిచ్చేలా ‘ముడిసరకు తెచ్చుకోండి- స్టీలు తీసుకెళ్లండి’ అనే కొత్త నినాదంలా సోమవారం ఉక్కు కర్మాగారం విడుదల చేసిన ‘‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (ఈఓఐ)’’

Published : 29 Mar 2023 03:15 IST

కేంద్రమంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్థేకు వినతిపత్రం అందిస్తున్న పోరాట కమిటీ నాయకులు

ఉక్కునగరం(గాజువాక)న్యూస్‌టుడే : విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు ఊతమిచ్చేలా ‘ముడిసరకు తెచ్చుకోండి- స్టీలు తీసుకెళ్లండి’ అనే కొత్త నినాదంలా సోమవారం ఉక్కు కర్మాగారం విడుదల చేసిన ‘‘ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్‌ (ఈఓఐ)’’ ప్రకటనను తక్షణమే రద్దు చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు. ఈ మేరకు వారు మంగళవారం దిల్లీలో కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్థేను కలిసి వినతిపత్రం అందించారు. ‘ఈఓఐ’ని విడుదల చేయడం ఏకపక్ష నిర్ణయమని, దీంతో ఉక్కు మనుగడకే ముప్పు వాటిల్లుతుందని వివరించారు. . కర్మాగారానికి అవసరమైన ముడిసరకును ప్రభుత్వం సిద్ధం చేస్తే, పూర్తిస్థాయి ఉత్పత్తి సాధిస్తామన్నారు. మంత్రిని కలిసిన వారిలో పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, ఎం.రాజశేఖర్‌, జె.అయోధ్యరామ్‌ తదితరులు పాల్గొన్నారు.

విశాఖ ఉక్కుని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని, రిజర్వేషన్లు కాపాడాలని, వెంటనే పదోన్నతుల కల్పించాలని కోరుతూ... ఉక్కు ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు మంగళవారం దిల్లీలోని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగన్‌సింగ్‌ కులస్థేకు వినతి అందించారు.సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.తౌడన్న, బి.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని