logo

దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా

పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వైకాపా నాయకులు సీతంరాజు సుధాకర్‌ వెల్లడించారు.

Updated : 29 Mar 2023 05:37 IST

వైకాపా నేత సీతంరాజు సుధాకర్‌

మాట్లాడుతున్న సీతంరాజు సుధాకర్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని వైకాపా నాయకులు సీతంరాజు సుధాకర్‌ వెల్లడించారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడినప్పటికీ తాను క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు చెప్పారు. వైకాపా కార్పొరేటర్లు నారాయణరావు, చెన్నా జానకీరామ్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు 35వేల ఓట్లు విశాఖ జిల్లా నుంచి వచ్చాయన్నారు. తెదేపా, భాజపా, పీడీఎఫ్‌ అభ్యర్థులకు ఓట్లు వేసిన వారిలో అత్యధికులు రెండో ప్రాధాన్య ఓటు తనకు వేశారన్నారు. ఓటమితో కుంగిపోలేదని, దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. శ్రీకాకుళం నుంచి పశ్చిమగోదావరి జిల్లా వరకు బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టిక్కెట్‌ కేటాయించలేదని, తమ జనాభా అధికంగా ఉన్నందున టిక్కెట్‌ ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతానన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైకాపాను బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.

తెదేపా నుంచి గెలుపొంది వైకాపాకు మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ ప్రస్తుతం దక్షిణ నియోజకవర్గ వైకాపా ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు సీతంరాజు సుధాకర్‌ ఆయనకు పోటీగా రావడంతో వాసుపల్లి తీసుకునే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని