logo

ముఖ్యమంత్రికి స్వాగతం, వీడ్కోలు

విశాఖలో జరుగుతున్న జీ20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి 7:05 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖపట్నం.

Published : 29 Mar 2023 03:15 IST

ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే : విశాఖలో జరుగుతున్న జీ20 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాత్రి 7:05 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ నుంచి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక కాన్వాయ్‌లో నగరంలోకి వెళ్లారు. కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, అమర్‌నాథ్‌, ఆదిమూలపు సురేష్‌, ఆర్‌.కె.రోజా, విడదల రజిని, జిల్లా కలెక్టర్‌ మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, వీఆర్‌డీఏ ఛైర్‌పర్సన్‌ విజయనిర్మల, ఎమ్మెల్యేలు బాబూరావు, నాగిరెడ్డి, వాసుపల్లి గణేష్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి రాత్రి 9.15 గంటలకు తిరుగు పయనమయ్యారు. ఆయనకు ప్రజాప్రతినిధులు, అధికారులు వీడ్కోలు పలికారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని