logo

వీడియోలో ఆవేదన.. విషాద ఘటన!!

ఉక్కు ఉద్యోగి దంపతులు అదృశ్యమైన ఘటన చివరికి విషాదాంతమయింది. తిరుమల నగర్‌ సమీపంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న వరప్రసాద్‌, మీరా దంపతులు సోమవారం రాత్రి అదృశ్యమయ్యారు.

Published : 30 Mar 2023 04:33 IST

న్యూస్‌టుడే, కూర్మన్నపాలెం

ఉక్కు ఉద్యోగి దంపతులు అదృశ్యమైన ఘటన చివరికి విషాదాంతమయింది. తిరుమల నగర్‌ సమీపంలోని శివాజీనగర్‌లో నివాసం ఉంటున్న వరప్రసాద్‌, మీరా దంపతులు సోమవారం రాత్రి అదృశ్యమయ్యారు. వారి మృతదేహాలు బుధవారం ఉదయం ఏలేరు కాలువలో బయటపడ్డాయి.

దాదాపు 38 గంటలపాటు గాలించగా.. చివరికి విగతజీవులై ఈ దంపతులు కనిపించడంతో స్వస్థలం కణితి కాలనీలో విషాదం నెలకొంది. మృతదేహాలను తీసుకురావడంతో నిర్వాసిత తెలుకలవీధిలోని కుటుంబ సభ్యులతోపాటు, స్నేహితులు, తెలుకల సంఘం నాయకులు వడ్లపూడి సీడబ్ల్యూసీ కూడలివద్దకు చేరుకున్నారు. వరప్రసాద్‌ తల్లి, కుమార్తె దివ్యలక్ష్మి, కుమారుడు కృష్ణసాయితేజ కన్నీరుమున్నీరయ్యారు. తెలుకల సంఘం నాయకులు, ఉక్కు ఓబీసీ సంఘం నాయకులు శ్మశాన వాటికకు చేరుకొని నివాళులర్పించారు.

* సోమవారం సాయంత్రం 6.30: అపార్టుమెంటు వాచ్‌మెన్‌కు ఇంటి తాళాలు ఇచ్చి గాజువాక వెళ్తున్నామన్నారు.

* 6.40: వడ్లపూడి నిర్మలా స్కూలు సమీపంలో బ్యాటరీ దుకాణం నుంచి వరప్రసాద్‌ తల్లి, కుమారుడు కృష్ణసాయితేజ ఇంటికి వచ్చారు.

* రాత్రి 7.00: వరప్రసాద్‌కు కృష్ణసాయితేజ ఫోన్‌ చేయగా గాజువాక వెళ్లామని సమాధానమిచ్చారు.

* 7.30: మీరా ఇంటిలో ఫోన్‌ విడిచిపెట్టి వెళ్లగా.. అందులోని సెల్ఫీ వీడియో చూసిన కృష్ణసాయితేజ...తండ్రికి ఫోన్‌ చేసేటప్పటికి స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉంది.

* 8.00: వరప్రసాద్‌ ఫోన్‌ను గూగుల్‌లో పరిశీలించగా అనకాపల్లి జిల్లా కొప్పాక వద్ద ఏలేరు కాలు వద్ద ఉన్నట్లు తెలిసింది.  ః 8.35: కృష్ణసాయితేజ, అతని స్నేహితులు ఏలేరు కాలువ వద్దకు చేరుకున్నారు. చెప్పులు, హ్యాండ్‌ బ్యాగు, చరవాణి, ద్విచక్రవాహనం, రెండు జతల దుస్తులు గుర్తించారు. ః 9.30: కృష్ణసాయితేజ ‘100’కు ఫోన్‌ చేసి పోలీసులకు వివరాలు వెల్లడించారు.

* 9.45: దువ్వాడ పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి వచ్చారు.

* మంగళవారం ఉదయం 6.30: కొప్పాక ఏలేరు కాలువవద్దకు కృష్ణసాయితేజ, కుటుంబ సభ్యులు, దువ్వాడ పోలీసులు, అనకాపల్లి సీఐ చేరుకున్నారు.

* 11.00: అప్పికొండనుంచి గజ ఈతగాళ్లను రప్పించి  సాయంత్ర 5 గంటలవరకు వలల సాయంతో కాలువలో గాలించారు. అయినా ఆచూకీ తెలియలేదు.

* బుధవారం ఉదయం 8.00: అనకాపల్లి జిల్లా రాజుపాలెం వద్ద ఏలేరు కాలువలో మృతదేహాలను అక్కడ విధుల్లో ఉన్న స్వీపర్‌ గుర్తించాడు.

8.15: అనకాపల్లి పోలీసులకు సమాచారం అందించారు.

* 9.00- 9.30: దువ్వాడ ఎస్‌ఐ దేముడునాయుడు, అనకాపల్లి సీఐ నర్సింగరావు, సిబ్బంది కాలువ వద్దకు చేరుకున్నారు. ః 2.30: మృత దేహాలను అనకాపల్లి ఎన్టీఆర్‌ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

* సాయంత్రం 4.30: మృత దేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు.

* 5.15: వడ్లపూడి సీడబ్ల్యూసీ కూడలికి రెండు అంబులెన్స్‌ల్లో మృతదేహాలను తీసుకువచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని