logo

గంజాయి రవాణా నిరోధానికి నిఘా పెంపు

గంజాయి రవాణా నిరోధానికి గట్టి నిఘా పెట్టామని ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. ఆమె బుధవారం ఎ.కోడూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు.

Published : 30 Mar 2023 04:33 IST

ఎ.కోడూరు పోలీస్‌స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ గౌతమి సాలి

కె.కోటపాడు, దేవరాపల్లి, న్యూస్‌టుడే: గంజాయి రవాణా నిరోధానికి గట్టి నిఘా పెట్టామని ఎస్పీ గౌతమి సాలి తెలిపారు. ఆమె బుధవారం ఎ.కోడూరు పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా  విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా గంజాయి అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే కఠిన చర్యలు తప్పవన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న 37 ప్రాంతాలను గుర్తించామన్నారు. వీటి వద్ద ప్రమాదాలు నివారించేందుకు రెవెన్యూ సిబ్బంది సహకారాన్ని తీసుకుంటున్నామని చెప్పారు. నేరాల సంఖ్య తగ్గే విధంగా గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఐ తాతారావు, ఎస్‌ఐ డి.నాగేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని