logo

‘దోషులకు శిక్ష పడే వరకు ఉద్యమిస్తాం’

ట్రాక్టరు యజమాని జామి సింహాచలంనాయుడు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దేవరాపల్లిలో బుధవారం రాత్రి భారీ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది.

Published : 30 Mar 2023 04:33 IST

దేవరాపల్లి కూడలిలో ఆందోళనకారుల మానవహారం

దేవరాపల్లి, న్యూస్‌టుడే: ట్రాక్టరు యజమాని జామి సింహాచలంనాయుడు మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని దేవరాపల్లిలో బుధవారం రాత్రి భారీ కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది. ఆయన మృతి చెంది పది రోజులు దాటినా పోలీసులు దోషుల్ని విచారించపోవడం పట్ల నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులకు శిక్ష పడే వరకు ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. బాధిత కుటుంబానికి బాసటగా  తరలివచ్చిన జనం సింహాచలంనాయుడు ఇంటి నుంచి కొవ్వొత్తులతో ర్యాలీగా బయలుదేరి నాలుగురోడ్ల ప్రధాన కూడలికి చేరుకుని మానవహారంగా ఏర్పడ్డారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకుడు డి.వెంకన్న మాట్లాడుతూ సింహాచలంనాయుడు మృతిపై సమగ్ర విచారణ చేసి, దోషులను శిక్షించాలన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు