logo

బార్క్‌ భూముల్లోనూ తవ్వేస్తాం... అక్రమంగా సంపాదిస్తాం

మండలంలో అక్రమ గ్రావెల్‌ వ్యాపారానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూములు, కొండల్లో తవ్వకాలకు పాల్పడిన వ్యాపారులు ఇప్పుడు అనాధీనం భూములు సైతం వదలడం లేదు.

Published : 30 Mar 2023 04:33 IST

తంతడి-వాడపాలెంలో గ్రావెల్‌ దందా
దృష్టిపెట్టని రెవెన్యూ, మైనింగ్‌ శాఖలు

అనాధీనం భూమిలో మట్టి తవ్వుతున్న పొక్లెయిన్‌

అచ్యుతాపురం, న్యూస్‌టుడే: మండలంలో అక్రమ గ్రావెల్‌ వ్యాపారానికి అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇప్పటివరకు ప్రభుత్వ భూములు, కొండల్లో తవ్వకాలకు పాల్పడిన వ్యాపారులు ఇప్పుడు అనాధీనం భూములు సైతం వదలడం లేదు. బాబా అణువిద్యుత్తు పరిశోధన కేంద్రం (బార్క్‌) నిర్మాణం పేరుతో గ్రావెల్‌్ తవ్వకాలకు పాల్పడి అక్రమంగా సంపాదించుకునే పనికి శ్రీకారం చుట్టారు. అచ్యుతాపురం మండలంలో తంతడి-వాడపాలెంలో ప్రభుత్వ అనాధీనం భూముల్లో రెండు రోజులుగా గ్రావెల్‌ తవ్వకాలు జరుగుతున్నాయి. పొక్లెయిన్‌తో తవ్విన గ్రావెల్‌ను లారీల్లో తరలిస్తున్నారు. బార్కుకు సంబంధించిన భూముల్లో తవ్వకాలు చేపట్డంతో ఇటు రెవెన్యూ అధికారులు, ఇటు ఏపీఐఐసీ అధికారులు, గనులశాఖ అధికారులు తమకు సంబంధించిన అంశం కాదని పట్టించుకోలేదు. దీనిపై వాడపాలెంకు చెందిన తెదేపా నాయకులు వంకా కృష్ణారావు మండిపడ్డారు. ప్రభుత్వ భూముల్లో అనుమతులు తీసుకోకుండా ప్రైవేటు గుత్తేదారు తవ్వకాలు చేయడం దారుణమన్నారు.

దీనిపై తహసీల్దార్‌ శ్రీనివాసరావును వివరణ కోరగా బార్క్‌ రక్షణగోడ నిర్మాణానికి వారికి చెందిన భూముల్లోనే తవ్వకాలు చేపట్టిన్నట్లు ఏపీఐఐసీ అధికారుల ద్వారా తెలుసుకున్నానన్నారు. బార్కు సొంత భూములు కనుక దీనిపై చర్యలు తీసుకోలేదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని