logo

టెండర్లు ఆహ్వానించి.. కార్యాలయానికి తాళం

పెందుర్తి మండలం సరిపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి..

Published : 30 Mar 2023 04:33 IST

తాళం వేసిన పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచి గొర్లె రామకృష్ణ, తదితరులు

సరిపల్లి (పెందుర్తి), న్యూస్‌టుడే: పెందుర్తి మండలం సరిపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికుల నిర్వహణకు టెండర్లు ఆహ్వానిస్తూ ప్రకటన ఇచ్చిన పంచాయతీ కార్యదర్శి.. బుధవారం కార్యాలయానికి తాళం వేసుకుని వెళ్లిపోవడంపై సర్పంచి గొర్లె రామకృష్ణ, గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్పంచి తెలిపిన వివరాలు ఇలా ఉన్నారు. సరిపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య టెండర్ల కోసం పంచాయతీ కార్యదర్శి నాగసాయీష్‌ ప్రకటన జారీ చేశారు. ఔత్సాహికులు టెండర్లు వేసేందుకు బుధవారం కార్యాలయానికి వచ్చారు. ఉదయం 11గంటల సమయంలో ఆయన పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ మేరకు గ్రామస్ధులు సర్పంచి గొర్లె రామకృష్ణ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కార్యదర్శికి ఫోన్‌ చేసినా స్విచ్ఛాఫ్‌ రావడంతో ప్రజలతో కలిసి పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. పెందుర్తి ఎంపీడీవో, ఈవోపీఆర్డీల దృష్టికి తీసుకెళ్లారు. గత ఏడాది కూడా పారిశుద్ధ్య టెండర్ల విషయంలో కార్యదర్శి అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ నెల 31న టెండరు ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారిని ఇ-మెయిల్‌ ద్వారా కోరినట్లు సర్పంచి రామకృష్ణ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని