logo

రఘునందనునికి భక్తజనవందనం

జగదభిరాముడు.. ఇనకుల సోముడైన శ్రీరామచంద్రుని కల్యాణ వేడుకతో ఊరూవాడా శోభాయమానంగా మారింది. రుత్వికుల వేదమంత్రాల ఘోష, భక్తుల జయజయధ్వానాల నడుమ సీతమ్మ తల్లిని రామయ్య తండ్రి పరిణమయాడే వేడుకను కనులారా తిలకించిన భక్తజనం ఆనందపరవశులయ్యారు.

Updated : 31 Mar 2023 05:36 IST

అనకాపల్లి పెదరామస్వామి కోవెలలో కల్యాణోత్సవం  

జగదభిరాముడు.. ఇనకుల సోముడైన శ్రీరామచంద్రుని కల్యాణ వేడుకతో ఊరూవాడా శోభాయమానంగా మారింది. రుత్వికుల వేదమంత్రాల ఘోష, భక్తుల జయజయధ్వానాల నడుమ సీతమ్మ తల్లిని రామయ్య తండ్రి పరిణమయాడే వేడుకను కనులారా తిలకించిన భక్తజనం ఆనందపరవశులయ్యారు.


కొత్తూరు నరసింగరావుపేటలో..

శ్రీరామ నవమి పండగ సందర్భంగా గురువారం ఊరూరా ఉన్న రామాలయాలు సందడిగా మారాయి. అన్న సమారాధనలు నిర్వహించారు. పలు గ్రామాల్లో స్వామివారి విగ్రహాలను వీధుల్లో ఊరేగించారు. కోలాటం, భజనలు వంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అనకాపల్లి పట్టణంలోని పెదరామస్వామి కోవెల వద్ద నిర్వహించిన కల్యాణోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన కర్రి యశోద బియ్యపు గింజలపై పెన్నుతో శ్రీరామ అని రాసి గ్రామంలో జరిగిన కల్యాణానికి తలంబ్రాలుగా అందజేసి భక్తిని చాటుకొన్నారు.

శ్రీరామ నామంతో తలంబ్రాలు


రాములోరి పెళ్లికి రామచిలుక!

న్యూస్‌టుడే, నర్సీపట్నం అర్బన్‌: నర్సీపట్నం కొత్తవీధి రామాలయంలో గురువారం సీతారాముల కల్యాణం నిర్వహిస్తున్న సమయంలో ఓ రామచిలుక వచ్చి రాముడి చేతిపై వాలింది. కొంతసేపు ఉండి అక్కడ ఉంచిన ప్రసాదాన్ని ఆరగించి ఎగిరిపోయింది. ఈ దృశ్యాన్ని ఓ భక్తుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా వైరల్‌గా మారింది.


అయోధ్యలో ఎంపీ పూజలు

నెహ్రూచౌక్‌ (అనకాపల్లి), న్యూస్‌టుడే: శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలో సీతారాములను అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బి.వి.సత్యవతి గురువారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీరామచంద్రమూర్తి జనన మూహూర్త సమయాన స్వామివారికి చేసిన ప్రత్యేక పూజలు తిలకించి మంగళహారతులను తీసుకున్నారు. సర్వ జనులపైౖ  శ్రీరాముని అనుగ్రహం సంపూర్ణంగా ఉండాలని పూజలు చేశారు.


కల్యాణ వేంకటేశ్వరునికి స్వర్ణ నేత్రాలు

మాడుగుల, న్యూస్‌టుడే:   కె.జె.పురం కూడలిలో కొలువైన కల్యాణ వేంకటేశ్వర స్వామికి శరగడం శ్రీనివాసరావు, సుధీర్‌ శ్రీరామనవమి సందర్భంగా స్వర్ణ నేత్రాలు, పట్టు వస్త్రాలు బహూకరించారు. ఆలయ ధర్మకర్త రాపేటి రామకొండలరావు మాస్టారుకు వీటిని అందజేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని