logo

దహనం చిత్రంలో అనకాపల్లి కళాకారులు

కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పెతకంశెట్టి సతీష్‌ కుమార్‌ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు ఆడారి మూర్తిసాయి నిర్మించిన దహనం చిత్రంలో అనకాపల్లి కళాకారులు నటించారు.

Published : 31 Mar 2023 04:23 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కిమ్స్‌ ఐకాన్‌ ఆసుపత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పెతకంశెట్టి సతీష్‌ కుమార్‌ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు ఆడారి మూర్తిసాయి నిర్మించిన దహనం చిత్రంలో అనకాపల్లి కళాకారులు నటించారు. శుక్రవారం విడుదల కానున్న ఈ చిత్రంలో దేవాదాయ శాఖాధికారిగా మళ్ల సురేంద్ర, అనకాపల్లికి చెందిన దాడి జగన్‌, గోల్డ్‌ వాసు నటించారు. విడుదలకు ముందే దహనం చిత్రం ఆరు జాతీయస్థాయి అవార్డులు అందుకున్నట్లు కళాకారులు తెలిపారు. లాహిరిలాహిరి లాహిరిలో చిత్ర ఫేమ్‌ ఓం ఆదిత్య హీరోగా, శాంతి చంద్ర, ఎఫ్‌ఎం బాబాయ్‌ చిత్రంలో నటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు