logo

ప్రమాదాలు జరుగుతున్నా పట్టదా?

జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పాయకరావుపేట మండలం సీతారాంపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Published : 31 Mar 2023 04:23 IST

జాతీయ రహదారిపై నిలిచిన లారీ

నక్కపల్లి, న్యూస్‌టుడే: జాతీయ రహదారిపై ఆగి ఉన్న వాహనాలు ప్రాణాంతకంగా మారుతున్నాయి. పాయకరావుపేట మండలం సీతారాంపురం వద్ద బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ఇలాంటి ఘటనలు జిల్లా పరిధిలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. జాతీయ రహదారి నిర్వహణ గుత్తేదారులు, పోలీసుల గస్తీ ఉంటున్నా, ప్రమాదాల నియంత్రణ అనుకున్నస్థాయిలో జరగడంలేదు. రాయి లోడుతో వెళుతున్న ఓ లారీ నక్కపల్లిలో మరమ్మతుల కారణంగా నిలిచిపోయింది. రాత్రి వేళల్లో ఇదే మార్గంలో వచ్చిన పలు వాహనాలు దగ్గరకు వచ్చేవరకూ దీన్ని గుర్తించలేకపోయారు. చాలామంది ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు పక్కకు తప్పిస్తేనే ప్రజల ప్రాణాలకు రక్షణ ఉంటుంది. ఈ దిశగా అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని