గీత దాటినందునే శ్రీదేవిపై చర్యలు
ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక చంద్రబాబు దళితుల ప్రస్తావన తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఎం.నాగార్జున అన్నారు
మంత్రి ఎం. నాగార్జున
వన్‌టౌన్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక చంద్రబాబు దళితుల ప్రస్తావన తెచ్చి లబ్ధి పొందాలని చూస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి ఎం.నాగార్జున అన్నారు. శుక్రవారం ఉదయం విశాఖ గవర్నర్ బంగ్లాలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెదేపా పాలనలో దళితుల సంక్షేమానికి రూ.33వేల కోట్లు ఖర్చు చేస్తే జగన్ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్లలో రూ.53వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. సీపీఐ నేత నారాయణకు తెదేపా పాలనలో జరిగిన అక్రమాలు గుర్తు రావడం లేదన్నారు. అమరావతిలో పేదలకు భూములు కేటాయిస్తే అడ్డుకోవడం సరికాదన్నారు. జగన్ పాలనలో ఎన్నడూ లేని విధంగా దళితులకు మేలు జరిగిందన్నారు. వైకాపా నాయకులకు ప్రతి ఇంటికి వెళ్లే అర్హత ఉందన్నారు. దళితులపై దాడి జరిగిన వెంటనే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని బాధితులకు అన్ని విధాలుగా రక్షణగా నిలుస్తోందన్నారు. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి గీత దాటినందునే పార్టీ చర్యలు తీసుకుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారో తమకు తెలుసునన్నారు. వైకాపా సానుభూతి పరులు శ్రీదేవికి వాహనం సమకూర్చారు. ఆమె పార్టీకి వ్యతిరేకంగా మారడంతో వాహనాన్ని తిరిగి తీసుకున్నారని, ఇందులో దౌర్జన్యమంటూ ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
82 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న అల్ పాసినో
-
World News
‘బ్లూటూత్’తో మెదడు, వెన్నెముకల అనుసంధానం!.. నడుస్తున్న పక్షవాత బాధితుడు
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
వనపర్తి జిల్లాలో ఇనుము ఉత్పత్తి క్షేత్రం ఆనవాళ్లు
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం