logo

ఆటోనగర్‌లో పార్కింగ్‌ ఆశీలుకు వేలం

ఆటోనగర్‌లో వాహనాల పార్కింగ్‌ ఆశీలు వసూళ్లకు శుక్రవారం ఏపీఐఐసీ సమావేశ మందిరంలో వేలం పాట నిర్వహించారు.

Published : 01 Apr 2023 06:47 IST

గుత్తేదారుకు అనుమతి పత్రం అందిస్తున్న ఐలా కమిషనర్‌ సూర్యనారాయణ, తదితరులు

అక్కిరెడ్డిపాలెం, న్యూస్‌టుడే : ఆటోనగర్‌లో వాహనాల పార్కింగ్‌ ఆశీలు వసూళ్లకు శుక్రవారం ఏపీఐఐసీ సమావేశ మందిరంలో వేలం పాట నిర్వహించారు. ఐలా కమిషనర్‌ కె.సూర్యనారాయణ సమక్షంలో నిర్వహించిన వేలంలో అయిదుగురు గుత్తేదార్లు పోటీ పడగా, శ్రీ నూకాంబిక ఇంజినీరింగ్‌ ఎంటర్‌ప్రైజస్‌ యజమాని రూ.4,36,300లకు వేలం పాట దక్కించుకున్నారు. ఏడాది పాటు ఆటోనగర్‌ ఏరియాలో వాహనాల పార్కింగ్‌ ఫీజు వసూళ్లకు అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఐలా అధ్యక్షులు కె.సత్యనారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి చీకటి సత్యనారాయణ, సభ్యులు పద్మావతి, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు.
* అనంతరం ఏటా మాదిరిగా ఐలా వార్షిక ఆదాయంలో 33 శాతాన్ని రూ.2.15 కోట్లను పన్ను రూపంలో జీవీఎంసీకి అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని