logo

కల్లుగీత కార్మికురాలిపై పోలీసు కన్నెర్ర

జీవనోపాధి కోసం కల్లు విక్రయిస్తున్న మహిళపై ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించిన సంఘటన శుక్రవారం విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

Published : 01 Apr 2023 06:53 IST

మహిళను లాక్కెళుతున్న పోలీసు

సింధియా, న్యూస్‌టుడే: జీవనోపాధి కోసం కల్లు విక్రయిస్తున్న మహిళపై ఓ పోలీసు దురుసుగా ప్రవర్తించిన సంఘటన శుక్రవారం విశాఖపట్నంలో చోటు చేసుకుంది. పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెంలో ఒక మహిళ సంచిలో కల్లు సీసాలు తీసుకొచ్చి విక్రయిస్తోంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా కల్లు విక్రయిస్తే ఎక్సైజ్‌ సిబ్బంది తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మాత్రం స్థానిక ఒక బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు చెందిన సిబ్బంది చొరవతో ఓ సివిల్‌ పోలీసు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ కల్లు విక్రయిస్తే.. బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు వినియోగదారులెవరూ రావడం లేదంటూ మండిపడ్డారు. మహిళ చేతిలో ఉన్న కల్లు సీసాల సంచిని బలవంతంగా లాక్కుని ఆమెను అక్కడినుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించారు. ఇంతలో జనం గుమిగూడడంతో పోలీసు, బార్‌ సిబ్బంది అక్కడినుంచి జారుకున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు