logo

ఆర్థిక వనరుల పెంపుపై దృష్టిసారించాలి

మార్చి 28వ తేదీ నుంచి విశాఖ వేదికగా ప్రారంభమైన జి-20 సన్నాహక సదస్సులు శుక్రవారంతో ముగిశాయి. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాలనుకున్నారు

Updated : 01 Apr 2023 07:20 IST

ముగిసిన జీ20 సన్నాహక సదస్సులు

సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు

ఈనాడు-విశాఖపట్నం: మార్చి 28వ తేదీ నుంచి విశాఖ వేదికగా ప్రారంభమైన జి-20 సన్నాహక సదస్సులు శుక్రవారంతో ముగిశాయి. తొలుత రెండు రోజులపాటు నిర్వహించాలనుకున్నారు. అయితే మరో రెండు రోజులు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతినిధులు చివరి రోజు పట్టణాలు, నగరాల్లో వందశాతం పన్నుల వసూళ్లకు సలహాలు, సూచనలు చేశారు. వసూలైన పన్నులతో నాణ్యమైన మౌలిక సదుపాయాలు, అన్ని వర్గాలు, వయసుల వారికి ఉపయోగపడేలా సౌకర్యాలు కల్పించాలన్నారు. ఆర్థిక వనరులను పెంచుకోవడంలో భాగంగా విజయవంతమైన విధానాలను పైలెట్‌ ప్రాజెక్టులుగా ప్రారంభించి అనుకూలతలు చూడాలన్నారు. ఆర్థిక నగరాల అంశంపై విభిన్నమైన ఆలోచనలు వచ్చాయని, అవి క్షేత్రస్థాయిలో ఆచరణాత్మకంగా ఉన్నాయని సమావేశాలకు అధ్యక్షత వహించిన కేంద్ర ఆర్థికశాఖ సంయుక్త కార్యదర్శి సాల్మన్‌ ఆరోఖ్యరాజ్‌ అన్నారు. చివరి రోజు మున్సిపల్‌ కమిషనర్లు, విద్యార్థులకు ప్రత్యేక సమావేశం నిర్వహించి ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని