logo

ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో జిల్లా నేతలు

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన వేపాడ చిరంజీవిరావు ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లాకు చెందిన పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు.

Published : 01 Apr 2023 07:03 IST

చిరంజీవిరావును అభినందిస్తున్న బుద్ద, తాతయ్యబాబు, కుమార్‌, రఘువర్మ తదితరులు

అనకాపల్లి, న్యూస్‌టుడే: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికైన వేపాడ చిరంజీవిరావు ప్రమాణ స్వీకారోత్సవంలో జిల్లాకు చెందిన పలువురు తెదేపా నేతలు పాల్గొన్నారు. శాసనమండలిలో శుక్రవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం తెదేపా అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ కలిసి చిరంజీవిరావు దంపతులను సత్కరించారు. తెదేపా ఇన్‌ఛార్జులు పి.వి.జి.కుమార్‌, బత్తుల తాతయ్యబాబు, పింఛనుదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బుద్ద కాశీ విశ్వేశ్వరరావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కడిమిశెట్టి నర్సింగరావు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు