ఇక మూడుపూటలా కోడిగుడ్డు
కేజీహెచ్ డైట్ క్యాంటీన్ కొత్త మెనూ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను రెట్టింపు చేసింది.
నేటి నుంచి కేజీహెచ్ డైట్‌లో మార్పు
రోగులకు ఆహారం పంపిణీ చేస్తున్న సిబ్బంది
వన్‌టౌన్, న్యూస్‌టుడే: కేజీహెచ్ డైట్ క్యాంటీన్ కొత్త మెనూ శనివారం నుంచి అమల్లోకి రానుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం డైట్ ఛార్జీలను రెట్టింపు చేసింది. ఇదే సమయంలో ఆహారం విషయంలో పలు మార్పులు చేసింది. 15ఏళ్ల నుంచి కేజీహెచ్‌లో రోగులకు మూడు పూటలా ఆహారం అందిస్తున్నారు. గుత్తేదారులు 10శాతం తగ్గించి టెండర్లు వేయడంతో రోజుకు ఒక్కో రోగిపై రూ.36 మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేస్తూ వస్తోంది. దీని వల్ల నాణ్యత సరిగా ఉండడం లేదని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోగుల డైట్ ఖర్చును రెట్టింపు చేసి రూ.80కు పెంచింది. ఇదే సమయంలో మెనూలో మార్పులు చేశారు.
* ఫిబ్రవరి నెలలో డైట్ గుత్తేదారుని నియమించేందుకు టెండర్లు పిలిచారు. నలుగురు గుత్తేదారులు ముందుకు వచ్చారు. నలుగురు ఒకే రకంగా కొటేషన్లు వేయడంతో ఒక్కొక్కరికి ఆరేసి నెలల చొప్పున డైట్ పనులను జిల్లా యంత్రాంగం అప్పగించింది. కొత్త కాంట్రాక్టు శనివారం నుంచి అమల్లోకి రానుంది.
ప్రస్తుత మెనూ ఇలా..:
* అల్పాహారం కింద పాలు/రొట్టె, కిచిడి, ఎర్రనూక ఉప్మా, తెల్లనూక ఉప్మాలో ఏదో ఒకటి ఇస్తున్నారు. బీ ఉదయం, రాత్రి భోజనంలో.. 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల సాంబారు, 160 గ్రాముల కూర, ఉడకబెట్టిన కోడి గుడ్డు, అరటి పండు, మజ్జిగ అందజేస్తున్నారు.
ఇక మీదట ఇలా..
* అల్పాహారంగా ఇడ్లీ 3(150 గ్రాములు), ఉప్మా, పాలు-రొట్టెల్లో ఏదో ఒకటి, ఉడకబెట్టిన కోడి గుడ్డు ఇవ్వనున్నారు.
* ఉదయం, రాత్రి భోజనంలో 600 గ్రాముల అన్నం, 200 గ్రాముల సాంబారు, గ్రేవీ కర్రి లేదా ముద్దకూర, ఉడకబెట్టిన కోడి గుడ్డు, అరటి పండు, 200 గ్రాముల మజ్జిగ పంపిణీ చేయనున్నారు.
* కిడ్నీ వ్యాధి బాధితులకు ఉప్పు రహిత ఆహారం, మధుమేహ బాధితులకు అన్నం తక్కువ, ఉడకబెట్టిన కూరలు, పుల్కాలతో కూడిన ఆహారం ఇవ్వనున్నారు.
ఇడ్లీ, ఒక కోడిగుడ్డు మాత్రమే అదనం : పాత, కొత్త మెనూలను పరిశీలిస్తే.. కొత్త దాంట్లో కేవలం 3 ఇడ్లీ, ఒక కోడిగుడ్డు మాత్రమే అదనంగా ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఈ మెనూకు ఛార్జీలు రెట్టింపు చేసి రూ.80 ఇస్తున్నారు. నాణ్యత పెంచుతామని, అధిక పోషక విలువలున్న ఆహారం రోగులకు అందిస్తామని అధికారులు చెబుతున్నారు.
పక్కాగా మెనూ అమలుకు చర్యలు
ప్రభుత్వ ఆదేశాలకు లోబడి రోగులకు పంపిణీ చేసే ఆహారంలో శనివారం నుంచి మార్పులు చేస్తున్నాం. జేసీ ఆదేశాల మేరకు నలుగురు గుత్తదారులు ఒక్కొక్కరు ఆరు నెలల చొప్పున కాంట్రాక్టు నిర్వహిస్తారు. ఆహార నాణ్యత విషయంలో నిరంతర నిఘా ఉంటుంది. ప్రస్తుతం ఇస్తున్న ఆహారంతో పోల్చితే కొత్తగా ఇవ్వబోయే దానిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి.
-హెచ్.వి.ఆర్.మూర్తి, చీఫ్ డైటీషియన్, కేజీహెచ్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
తిరుపతి జూలో పులి పిల్ల మృతి.. నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమా!
-
Ap-top-news News
అవినాష్ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి
-
Ts-top-news News
అభివృద్ధిపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే ఆగ్రహం.. వృద్ధురాలి పింఛన్ తొలగింపునకూ ఆదేశం
-
India News
పరుగులు తీసే కారుపై ఎక్కి కసరత్తులా!
-
Sports News
IPL Final: ‘బాగా బౌలింగ్ చేస్తున్న వాడిని ఎందుకు డిస్టర్బ్ చేశావు’.. హార్దిక్‌పై సెహ్వాగ్ ఫైర్
-
India News
Maharashtra: మరో జిల్లాకు పేరు మారుస్తూ శిందే సర్కార్ ప్రకటన