logo

మాకవరపాలెం కుర్రాడు.. మూడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేశాడు!

ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఎందరో యువకుల కల. అదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటే మరీ గొప్ప.

Updated : 16 May 2023 08:52 IST

మాకవరపాలెం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనేది ఎందరో యువకుల కల. అదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమంటే మరీ గొప్ప. అందుకోసం రాత్రింబవళ్లు శ్రమిస్తుంటారు. అలాంటిది అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలోని ఓ యువకుడు ఏకంగా మూడు ఉద్యోగాలు దక్కించుకున్నాడు. ప్రస్తుతం రైల్వేలో శిక్షణ పొందుతున్న యువకుడికి మరో రెండు అవకాశాలు తలుపు తట్టాయి.

మాకవరపాలెంకు చెందిన రుత్తల సత్యనారాయణ, పద్మావతి కుమారుడు రుత్తల రేవంత్‌ ఈ ఘనత సాధించాడు. రేవంత్‌ తండ్రి వ్యాపారం చేస్తుండగా, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. జీవితంలో పెద్దహోదాకు చేరాలన్న లక్ష్యం పెట్టుకున్న రేవంత్‌ చిన్నతనం నుంచే కష్టపడి చదివాడు. ప్రస్తుతం రైల్వేలో ట్రైనీ మేనేజర్‌ శిక్షణలో ఉన్నాడు. దీంతోపాటు 2021లో స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌.ఎస్‌.సి.) పరీక్షలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ విభాగంలో అకౌంటెంట్‌గానూ ఎంపికయ్యాడు. దీనికి సంబంధించి నియామక ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తునాడు. ఈ ఏడాది మార్చిలో జరిగిన పరీక్షకు హాజరయ్యాడు. ఈనెల 13 రాత్రి విడుదలైన ఫలితాల్లో 390 మార్కులకు గానూ 332 మార్కులు సాధించాడు. దీంతో కస్టమ్స్‌ డిపార్టుమెంట్‌లో కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ కస్టమ్స్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎగ్జామినర్‌)గా అర్హత సాధించాడు. తమ కుమారుడు రేవంత్‌ సాధించిన విజయాలను చూసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని