logo

విదేశీయుల ఆపసోపాలు

మయన్మార్‌ దేశానికి చెందిన సాంస్కృతిక ప్రతినిధులు ఆరుగురు విశాఖ సందర్శనకు వచ్చారు. ఈ నెల 15 నుంచి ఇక్కడి పలు ప్రాచీన, సందర్శనీయ ప్రాంతాలను వీక్షించారు.

Published : 18 May 2023 03:54 IST

పావురాలకొండపైకి వెళ్లేందుకు అవస్థలు

ఈనాడు, విశాఖపట్నం : మయన్మార్‌ దేశానికి చెందిన సాంస్కృతిక ప్రతినిధులు ఆరుగురు విశాఖ సందర్శనకు వచ్చారు. ఈ నెల 15 నుంచి ఇక్కడి పలు ప్రాచీన, సందర్శనీయ ప్రాంతాలను వీక్షించారు. పురావస్తు, పర్యాటకశాఖ అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. భీమిలిలోని పురాతన చర్చి, డచ్‌ సమాధులు, ఫ్లాగ్‌ ఆఫీసర్ల సమాధులు, దీపస్తంభం, తొట్లకొండ చూశారు. అశోకుడి కాలం నాటి చారిత్రక వివరాలు తెలుసుకోవాలనే ఆశతో మంగళవారం భీమిలి పరిధిలోని పావురాలకొండ సందర్శనకు వెళ్లి ఆపసోపాలు పడ్డారు. కొండపైకి సరైన మార్గం లేక అవస్థలు పడ్డారు. రాళ్లు తేలిన రహదారిపై వాహనం వెళ్లేందుకు అనువుగా లేక వారంతా నడుస్తూనే ముందుకు సాగారు. ఎంతో ప్రాశస్త్యం కలిగిన ప్రాంతానికి సరైన మార్గం లేకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. తొట్లకొండ మీద బౌద్దారామాల నిర్వహణ కూడా సక్రమంగా లేదనే భావన వ్యక్తం చేశారు. బుధవారం అనకాపల్లి జిల్లాలోని బొజ్జన్న కొండను తిలకించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని