సదా అమూల్ సేవలో..
అమూల్ అంటే సర్కారుకు అవ్యాజ్యమైన ప్రేమ.. ఆ సంస్థ ఏం కోరినా అధికారులతో చకచకా ఏర్పాట్లు చేయిస్తోంది. పాడి రైతులను సంఘటితం చేయడం నుంచి పాలసేకరణకు అవసరమైన వసతిని కల్పించడం వరకూ అన్నీ అధికారులే చూసుకుంటున్నారు..
అంగన్‌వాడీ కేంద్రాలకూ అవే పాలు!
ఈనాడు డిజిటల్, అనకాపల్లి
అమూల్ అంటే సర్కారుకు అవ్యాజ్యమైన ప్రేమ.. ఆ సంస్థ ఏం కోరినా అధికారులతో చకచకా ఏర్పాట్లు చేయిస్తోంది. పాడి రైతులను సంఘటితం చేయడం నుంచి పాలసేకరణకు అవసరమైన వసతిని కల్పించడం వరకూ అన్నీ అధికారులే చూసుకుంటున్నారు.. నెల నెలా పాలసేకరణ పెరిగేలా లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు.. తాజాగా అంగన్‌వాడీ కేంద్రాలకూ ఆ సంస్థ పాలనే సరఫరా చేయాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ చిన్నారులకు ప్రస్తుతం ఇస్తున్న పాలు స్థానంలో అమూల్ నుంచి ఫ్లేవర్డ్ మిల్క్ అందించాలనుకుంటున్నారు. అయితే ఆ సంస్థకు ఇబ్బంది లేకుండా మైదాన ప్రాంతంలో ఉన్న కేంద్రాలకే పాల సరఫరా పరిమితం చేయాలనుకోవడం. అల్లూరి జిల్లాలో కేంద్రాలను పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో అమూల్‌కు ప్లాంట్ ఉంది. ఉమ్మడి జిల్లాలో 190 పాల సేకరణ కేంద్రాల నుంచి ప్రస్తుతం రోజూ 17 వేల లీటర్ల పాలను సేకరిస్తోంది. ఏడాది క్రితం రాష్ట్రంలో అడుగుపెట్టిన ఈ సంస్థ మిగతా డెయిరీలతో పోల్చుకుంటే చాలా తక్కువ మొత్తంలో పాలసేకరణ చేస్తోంది. దీంతో ప్రభుత్వమే చొరవ తీసుకుని అమూల్ పాలసేకరణ పెరిగేలా చేయడంతో పాటు వాళ్లు సేకరించిన పాలను అమ్మిపెట్టే బాధ్యతను తీసుకుంటోంది. ఇప్పటికే విశాఖలో అమూల్ స్టాల్స్ పేరుతో దుకాణాలను ఇబ్బడిముబ్బడిగా పెట్టించారు. ఇప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్ పాలనే అందించాలని నిర్ణయానికి వచ్చారు. ప్లాంట్‌కు 75 కిలోమీటర్ల పరిధిలో కేంద్రాలకే ఈ పాలను సరఫరా చేయనున్నారు. ముందుగా 3 నుంచి 6 ఏళ్లలోపు చిన్నారులకు రోజుకు 100 మి.లీ., వైఎస్సార్ సంపూర్ణ పోషణ్ ప్లస్ మండలాల్లో పిల్లలకు 200 మి.లీ చొప్పున ప్రతి రోజూ 3,960 లీటర్లు ఫ్లేవర్డ్ మిల్క్ సరఫరా చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. తర్వాత దశలో మిగతా లబ్ధిదారులకు అమూల్ పాలనే అందించే ఆలోచన చేస్తున్నారు.
కేంద్రాల్లో చిన్నారులకు గ్లాసుల్లో ఇస్తున్న పాలు
పాల కొరత తీరేనా..
ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాలకు ఏపీ డెయిరీ కర్ణాటక నుంచి పాల సరఫరా చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 4,900 కేంద్రాల్లో అన్ని వర్గాల లబ్ధిదారులకు కలిపి సుమారు 11.49 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతున్నాయి. గత కొన్నాళ్లుగా సరఫరా సక్రమంగా జరగడం లేదు. పాల లభ్యత తగ్గిపోవడం, బిల్లులు సక్రమంగా ఇవ్వకపోవడంతో అరకొరగానే సరఫరా చేస్తున్నారు.
రోజూ సరఫరా అంటే సాధ్యమేనా?
ప్రస్తుతం ఏపీ డెయిరీ నుంచి వచ్చే పాలు నెలలో ఒకరోజే ఒకటి, రెండు నెలలకు సరిపడా పాలను టెట్రా ప్యాకింగ్‌తో సరఫరా చేస్తున్నారు. అమూల్ పాలు మాత్రం రోజూ కేంద్రాలకు చేరవేయాల్సి ఉంటుంది. ఆ పాలు ఒకరోజు కంటే నిల్వ ఉండే అవకాశం లేదు. దీంతో ఏరోజు అవసరమైన పాలు ఆ రోజే సరఫరా చేయాలి. రోజూ 2,684 కేంద్రాలకు తీసుకువెళ్లి అందించడం సాధ్యం కాదని సంబంధిత అధికారులే చెబుతున్నారు. పైగా ఒక కేంద్రంలో పది మంది ఉంటే మరో కేంద్రం 15 మంది వరకు ఉంటారు. తక్కువ మంది ఉన్న కేంద్రాలకు ప్రతిరోజూ పాలను తీసుకువెళ్లి అందించడం రవాణా వర్గాలకు కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక సెంటర్‌లో పది మంది పిల్లలుంటే వారిలో ఆరుగురే హాజరయ్యారనుకుంటే ఆ ఆరుగురికే పాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాకాదని మర్నాటికి దాస్తే పాడైపోతాయి. వీటిని కేంద్రాలకు చేరవేసే బాధ్యతను రవాణా శాఖకు అప్పగిస్తున్నారు. ఈ విషయమై అనకాపల్లి జిల్లా పశుసంవర్థక శాఖ డీడీ ప్రసాదరావు, ఐసీడీఎస్ పీడీ ఉషారాణి వద్ద ప్రస్తావించగా అంగన్‌వాడీలకు అమూల్ పాల సరఫరా ప్రతిపాదన ఉందని అంగీకరించారు. అయితే ఇంకా ఎప్పుటి నుంచి అందించాలనేది ఖరారు చేయలేదన్నారు. రవాణా సదుపాయం వంటి వాటిపై కసరత్తు జరుగుతోందని వివరించారు.
ఈ క్రమంలో అంగన్‌వాడీ కేంద్రాల్లోని ప్రీ స్కూల్ పిల్లలకు (3-6 ఏళ్లలోపు) స్థానికంగా లభ్యమయ్యే అమూల్ పాలను సరఫరా చేస్తే పాల కొరతను అధిగమించడంతో పాటు.. ఆ సంస్థకు కొంత మేలు చేకూర్చినట్లుంటుందని సర్కారు పెద్దలు ఆలోచించారు. అన్నీ అనుకూలిస్తే వచ్చే నెల నుంచే అంగన్‌వాడీ కేంద్రాల్లోకి అమూల్ అడుగుపెట్టబోతుంది.
విశాఖ, అనకాపల్లి జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలకు అమూల్ పాల సరఫరా ప్రతిపాదనలు ఇలా..
అంగన్‌వాడీ కేంద్రాలు : 2,684
3-6 సంవత్సరాల పిల్లలు 36,371
నెలలో సరఫరాచేసే రోజులు: 25
నెలకు కావాల్సిన పాలు : 1.04 లక్షల లీటర్లు
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Andhra News: రైలు ప్రమాదం.. 141 మంది ఏపీ వాసుల కోసం ప్రయత్నిస్తున్నాం: బొత్స
-
Sports News
Sachin: అర్జున్.. నీ ఆటపై శ్రద్ధ పెట్టు.. తనయుడికి సూచించిన సచిన్ తెందూల్కర్
-
Movies News
Aishwarya Lekshmi: నటిని అవుతానంటే నా తల్లిదండ్రులే వ్యతిరేకించారు: ఐశ్వర్య లక్ష్మి
-
India News
20 ఏళ్లలో 3 సార్లు కోరమాండల్‌కు ప్రమాదం.. రెండు ఒడిశాలోనే!
-
Sports News
David Warner: టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్.. అదే ఆఖరు సిరీస్
-
India News
PM Modi: బాధ్యులపై కఠిన చర్యలు : ఒడిశా రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ