logo

వణికించిన ఈదురు గాలులు

చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.

Published : 29 May 2023 06:14 IST

మైచర్లపాలెం రోడ్డుకు అడ్డంగా కూలిన చెట్లు

బుచ్చెయ్యపేట, చోడవరం గ్రామీణం, కె.కోటపాడు, రావికమతం, న్యూస్‌టుడే: చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలో పలుచోట్ల ఆదివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులకుతోడు ఈదురుగాలులు బలంగా వీయడంతో బుచ్చెయ్యపేటలో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బీఎన్‌ రోడ్డులో గోతుల్లో వర్షపు నీరు చేరడంతో రాకపోకలు సాగించేందుకు వాహనచోదకులు ఇబ్బందులు పడ్డారు. కె.కోటపాడు మండలం చౌడువాడ, గుల్లిపల్లి, పైడమ్మపేట, గొండుపాలెం, మేడిచర్ల, సూర్రెడ్డిపాలెం, ఎ.కోడూరు తదితర గ్రామాల్లో వర్షంతోపాటు వడగళ్లు పడ్డాయి. మేడివాడ, కొత్తకోటలో పిడుగులు పడ్డాయి. కొత్తకోటకు చెందిన గుమ్ముడు బాబూరావు పశువుల పాకల వద్ద వరిగడ్డి మేటు పిడుగుపడి దగ్ధమైంది. మేడివాడలో గొర్లె సత్తిబాబు, యన్నంశెట్టి శేషు, జంపా రాములు ఇళ్లలో ఇన్వెర్టర్లు, టీవీలు కాలిపోయాయి. పలుచోట్ల విద్యుత్తు తీగలపై చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి.

గవరవరంలో సిమెంటు రోడ్డుపై పడిన విద్యుత్తు స్తంభం

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని