logo

విద్యలో నాణ్యత, సమానత్వం, సమగ్రత తీసుకురావాలి

వ్యవస్థలో నాణ్యత, సమానత్వం, సమగ్రతను తీసుకు రావడానికి విద్యలో అవసరమైన సంస్కరణలు చేయాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ అన్నారు.

Published : 29 May 2023 06:23 IST

కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌

సదస్సులో పాల్గొన్న అతిథులు

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : వ్యవస్థలో నాణ్యత, సమానత్వం, సమగ్రతను తీసుకు రావడానికి విద్యలో అవసరమైన సంస్కరణలు చేయాల్సి ఉందని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుభాష్‌ సర్కార్‌ అన్నారు. బీచ్‌రోడ్డులోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లో భారతీయ ఇంజినీరింగ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ(బెస్ట్‌) ఇన్నొవేషన్‌ యూనివర్సిటీ, కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, టూరిజం శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న రెండు రోజుల సదస్సులో ఆయన వర్చువల్‌ విధానంలో ప్రారంభోపన్యాసం చేశారు. అత్యుత్తమ ఇన్నొవేషన్‌ విశ్వవిద్యాలయం నిర్మించి, భారతీయ విలువలను పెంపొందించే విధంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కార్యక్రమానికి బెస్ట్‌ యూనివర్సిటీ వ్యవస్థాపక ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రూపా వాసుదేవన్‌ స్వాగతం పలికారు. భాజపా విదేశీ వ్యవహారాల ఇన్‌ఛార్జి డాక్టర్‌ విజయ్‌ చౌతైవాలే మాట్లాడుతూ యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌(యు.పి.ఐ), కొవిడ్‌ వ్యాక్సిన్‌ అనే రెండు ఆవిష్కరణలు భారతదేశ ఖ్యాతిని ప్రపంచదేశాల్లో నిలిపాయన్నారు. కార్యక్రమంలో ఆచార్య అశుతోష్‌ శర్మ ‘సుస్థిర అభివృద్ధికి విఘాతం కలిగించే సైన్స్‌’ అన్న అంశంపై మాట్లాడారు. భారతీయ విశ్వవిద్యాలయాల సంఘం సెక్రటరీ జనరల్‌ డాక్టర్‌ పంకజ్‌ మిట్టల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు, ఉపాధ్యాయులు మారుతున్న విద్య ప్రకృతి దృశ్యానికి అనుగుణంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్‌ శ్రీనివాసరావు, వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని