logo

సంపద సృష్టించి పేదలకు పంచడమే తెదేపా ధ్యేయం

మహిళలు, యువత, రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించేలా రూపొందించిన తొలిదశ తెదేపా మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని, దీన్ని చూసి వైకాపా నాయకుల వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి, ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు.

Published : 31 May 2023 03:43 IST

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న మాజీ మంత్రి గంటా. చిత్రంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీరావు, పల్లా శ్రీనివాసరావు తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: మహిళలు, యువత, రైతులను వెన్నుతట్టి ప్రోత్సహించేలా రూపొందించిన తొలిదశ తెదేపా మేనిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోందని, దీన్ని చూసి వైకాపా నాయకుల వెన్నులో వణుకు మొదలైందని మాజీ మంత్రి, ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మంగళవారం తెదేపా కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో గంటా మాట్లాడారు. ‘ తెదేపా  మేనిఫెస్టో రాష్ట్ర ప్రజల మనసు దోచుకుంది. తెదేపాకు అది పవిత్ర గ్రంథం. దీన్ని తయారు చేసేందుకు సీనియర్‌ నేతలతో ఒక కమిటీ ఉంది. అధికారంలోకి రాగానే  మేనిఫెస్టోలోని ప్రతి అంశం అమలు చేస్తాం. సంపద సృష్టించి, ఆయా ఫలాలను సంక్షేమం రూపంలో పేదలకు అందజేస్తాం.  చంద్రబాబు ఒకసారి మాట ఇచ్చారంటే నూటికి నూరుపాళ్లు అమలు చేస్తారు. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ పేరుతో జగనాసుర పాలనకు చరమగీతం పాడతాం’ అని గంటా వివరించారు.

* తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహానాడు ఊహించినదాని కన్నా విజయ వంతమైందని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ ‘పూర్‌టూ రిచ్‌’ పథకం అద్భుతమన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావడం, తద్వారా సంపద సృష్టించడం, దాన్ని పేదలకు పంచి ధనవంతులను చేయడం ఇందులో భాగమన్నారు. 20లక్షల ఉద్యోగాలను కల్పించి నిరుద్యోగితను తగ్గించడమే తెదేపా లక్ష్యమన్నారు. అది సాధించేలోపు రూ.3వేల చొప్పున భృతి ఇస్తామన్నారు.  అనంతరం చంద్రబాబు చిత్రపటానికి నేతలు క్షీరాభిషేకం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు