logo

మహిళా పక్షపాతి చంద్రన్న

తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో తెలుగు మహిళ విభాగం ఆధ్వర్యంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు.

Published : 31 May 2023 03:43 IST

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

అనకాపల్లి, న్యూస్‌టుడే: తెదేపా ఎన్నికల మ్యానిఫెస్టోలో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినందుకు కృతజ్ఞతగా మంగళవారం పట్టణంలోని పలు ప్రాంతాల్లో తెలుగు మహిళ విభాగం ఆధ్వర్యంలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చిత్రపటాలకు పాలాభిషేకాలు నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు ఆడారి మంజు, పార్టీ జిల్లా అధ్యక్షులు బుద్ధ నాగజగదీశ్వరరావు ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంజు మాట్లాడుతూ ఆడబిడ్డకు నెలకు రూ. 1,500 ప్రకటించడం హర్షణీయమన్నారు. బస్సులో ఉచిత ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్‌ సిలెండర్లు ప్రకటించడం అభినందనీయమన్నారు. చంద్రబాబు మహిళా పక్షపాతని మరోసారి నిరూపించుకున్నారని తెలిపారు. జిల్లా ప్రధాన కార్యదర్శి సుకల రమణమ్మ మాట్లాడుతూ దీపం పథకం, డ్వాక్రా సంఘాలను ప్రవేశపెట్టి మహిళలను ఆదుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, జిల్లా ఉపాధ్యక్షురాలు శంకర్ల పద్మలత, కాయల ప్రసన్నలక్ష్మి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి భీశెట్టి హేమ, కార్యదర్శి వేదుల సూర్యప్రభ, చోడవరం నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోటా నీలవేణి పాల్గొన్నారు. భీమునిగుమ్మం, గవరపాలెం, సతకంపట్టు, పరమేశ్వరి ఉద్యానవనం ప్రాంతాలలోనూ చంద్రబాబు చిత్రపటాలకు మహిళలు పాలాభిషేకాలు చేశారు. కార్యక్రమాల్లో నేతలు సబ్బవరపు గణేష్‌, మళ్ల సురేంద్ర పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని