logo

అధికారభాష అమలులో వాల్తేర్‌ రైల్వేకు ప్రథమ స్థానం

అధికార భాష అమలులో వాల్తేర్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం ప్రథమ, ఈస్ట్రన్‌ నేవల్‌ ద్వితీయ, కస్టమ్స్‌ కమిషనరేట్‌ కార్యాలయం తృతీయ స్థానంలో నిలిచినట్లు వాల్తేర్‌ డీఆర్‌ఎం అనూప్‌ సత్పథీ తెలిపారు.

Published : 01 Jun 2023 04:27 IST

వాల్తేర్‌ డీఆర్‌ఎం కార్యాలయ అధికారులకు ప్రథమ బహుమతి అందజేస్తున్న డీఆర్‌ఎం అనూప్‌ సత్పథీ

రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: అధికార భాష అమలులో వాల్తేర్‌ డివిజన్‌ రైల్వే మేనేజర్‌ కార్యాలయం ప్రథమ, ఈస్ట్రన్‌ నేవల్‌ ద్వితీయ, కస్టమ్స్‌ కమిషనరేట్‌ కార్యాలయం తృతీయ స్థానంలో నిలిచినట్లు వాల్తేర్‌ డీఆర్‌ఎం అనూప్‌ సత్పథీ తెలిపారు. 76వ పట్టణ అధికార భాష అమలు కమిటీ సమావేశం బుధవారం వాల్తేర్‌ డీఆర్‌ఎం కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించారు. డీఆర్‌ఎం అనూప్‌ సత్పథీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల అధికారులు పాల్గొన్నారు. అధికార భాష హిందీ అమలుకు కృషి చేసిన మూడు చిన్న కార్యాలయాలు, 3 పెద్ద కార్యాలయాలను ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలకు ఎంపిక చేసి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. చిన్న కార్యాలయాల విభాగంలో ఫిషరీస్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రథమ, కేంద్రీయ విద్యాలయం-2 నౌసేన బాగ్‌ ద్వితీయ, కేంద్రీయ విద్యాలయం-ఐఎన్‌ఎస్‌ కళింగ తృతీయ స్థానాల్లో నిలిచి బహుమతులు గెలుచుకున్నట్లు తెలిపారు. గత 6 నెలల్లో నిర్వహించిన హిందీ స్లోగన్‌ రైటింగ్‌ తదితర పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఏడీఆర్‌ఎం మనోజ్‌కుమార్‌ సాహు, వాల్తేర్‌ రైల్వే అసిస్టెంట్‌ పర్సనల్‌ అధికారి వెంకటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.

డీఆర్‌ఎం చేతుల మీదుగా ద్వితీయ బహుమతి అందుకుంటున్న ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ అధికారులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని