logo

అనుకున్నట్లే.. పెంచేశారు!!

ప్రభుత్వం ప్రత్యేక సవరణ (స్పెషల్‌ రివిజన్‌) పేరుతో పెంచిన భూముల మార్కెట్‌ విలువలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో దాదాపు 30 శాతం నివాస, వాణిజ్య ప్రాంతాల్లో విలువలు పెంచారు.

Published : 02 Jun 2023 03:28 IST

భూముల మార్కెట్‌ విలువల పెంపు
తొలిరోజు బోసిపోయిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు
ఈనాడు, విశాఖపట్నం

ప్రభుత్వం ప్రత్యేక సవరణ (స్పెషల్‌ రివిజన్‌) పేరుతో పెంచిన భూముల మార్కెట్‌ విలువలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఆయా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిలో దాదాపు 30 శాతం నివాస, వాణిజ్య ప్రాంతాల్లో విలువలు పెంచారు. కొన్నిచోట్ల పెంపు చాలా ఎక్కువగా ఉంది. తాజా పెంపు స్థిరాస్తి రంగంపై ప్రభావం చూపుతుందని ఆ రంగ నిపుణులు చెబుతున్నారు. విలువలు పెరిగినప్పటికీ ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఆ వివరాలు కనిపించడం లేదు. పాతవే కనిపిస్తున్నాయి. దాదాపు అన్ని  కార్యాలయాల పరిధిలో కొత్త ధరలు అప్‌లోడ్‌ చేసే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

కొనుగోళ్లకు నిరాసక్తత

జూన్‌ ఒకటి నుంచి ధరలు పెరగడంతో ఆస్తుల క్రయవిక్రయాలకు పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. గురువారం నగరంలోని సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు బోసిపోయాయి. ధరలు పెరుగుతాయనే ముందస్తు సమాచారంతో చాలా మంది ముందుగానే డాక్యుమెంట్లు సిద్ధం చేసుకొని రిజిస్ట్రేషన్లు పూర్తిచేసుకున్నారు. కొత్తగా చేసేవారు మాత్రం గురువారం రాలేదు. విశాఖ జిల్లాలో అత్యధిక రద్దీగా ఉండే మధురవాడలో కేవలం రెండు విక్రయ డాక్యుమెంట్లకు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయింది. అలాగే ద్వారకానగర్‌లో రెండు, సూపర్‌బజార్లో మూడు డాక్యుమెంట్లు అయ్యాయి. జిల్లా అంతటా కలిపి 20 రిజిస్ట్రేషన్లు కూడా కాలేదు.

* మూడేళ్లుగా పెంచలేదు: భూముల మార్కెట్‌ విలువలను మూడేళ్లుగా సవరించలేదు. వాటిని సరిచేసే క్రమంలోనే మార్కెట్‌ ధరకు, రిజిస్ట్రేషన్‌ ధరకు ఉన్న వ్యత్యాసం ఆధారంగా సగటున 22 నుంచి 29 శాతం వరకు భూముల విలువలు పెంచాం. నగర పరిధితో పాటు శివారు ప్రాంతాల్లోని క్రయవిక్రయాలు జరిగే చోట సవరణ చేపట్టాం. 80 శాతం ప్రాంతాల్లో  సవరణ జరగలేదు. నగరంలో అయిదు నుంచి 10 శాతం పెంచాం.

బాలకృష్ణ, డీఐజీ, రిజిస్ట్రేషన్‌శాఖ

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని