logo

డయల్‌ యువర్‌ సీపీకి ఫిర్యాదులు

ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి 8 మంది ఫోన్లు చేసి తమ సమస్యలను తెలియజేశారు.

Published : 02 Jun 2023 03:28 IST

ఫోన్‌లో వివరాలు తెలుసుకుంటున్న సీపీ త్రివిక్రమ వర్మ

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమ వర్మ నిర్వహించిన డయల్‌ యువర్‌ కమిషనర్‌ కార్యక్రమానికి 8 మంది ఫోన్లు చేసి తమ సమస్యలను తెలియజేశారు. ప్రతీ నెలా 1, 15 తేదీల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్‌ యువర్‌ సీపీ నిర్వహిస్తున్న సంగతి విదితమే. ఈ కార్యక్రమం తరువాత తక్షణమే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడి ఫిర్యాదులపై  స్పందించాలని సీపీ ఆదేశించారు. డయల్‌ యువర్‌ సీపీ కార్యక్రమానికి 0891-2523408 ఫోన్‌నెంబరుకు నేరుగా ఫోన్‌ చేసి సమస్యలు చెప్పవచ్చని సీపీ తెలిపారు. అలాగే వాట్సాప్‌ ద్వారా చిత్రాలు, వీడియోలతో కూడిన ఫిర్యాదులు 9493336633 నెంబరుకు పంపించవచ్చన్నారు. కార్యక్రమంలో డీసీపీలు విద్యాసాగర్‌నాయుడు, ఆనందరెడ్డి, నాగన్న, ఏడీసీపీలు గంగాధరం, నాగేంద్రుడు, ఆరీఫుల్లా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని